LED TV Price Hike: టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్‌ వరకు ఆగితే అంతే..

|

Mar 11, 2021 | 9:13 PM

LED TV Price Hike: టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే వెంటనే త్వరపడండి.. లేదు ఏప్రిల్‌ వరకు ఆగుతామనుకుంటే మాత్రం ధరలు మండిపోనున్నాయి. దేశంలో ఎల్‌ఈడీ టీవల ధరలు...

LED TV Price Hike: టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్‌ వరకు ఆగితే అంతే..
Follow us on

LED TV Price Hike: టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే వెంటనే త్వరపడండి.. లేదు ఏప్రిల్‌ వరకు ఆగుతామనుకుంటే మాత్రం ధరలు మండిపోనున్నాయి. దేశంలో ఎల్‌ఈడీ టీవల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి విపరీతంగా పెరిగిపోనున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్‌ సెల్‌ ప్యానెల్స్‌ ధరలు పెరగడంతో టీవీల ధరలను పెంచాల్సి వస్తుందని టీవీ తయారీ సంస్థలు చెబుతున్నాయి.
గడిచిన నెల రోజుల్లో సెల్‌ ప్యానెల్స్‌ ధరలు ఏకంగా 35 శాతం పెరిగాయి. ఇప్పటికే ఎల్‌జీ కంపెనీల తమ టీవీల ధరలను పెంచేసింది. ఇక ప్యానసోనిక్‌, థామ్సన్‌, హయర్‌లు ఏప్రిల్‌ 1 నుంచి ధరలు పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం 5 నుంచి 7 శాతం మేర టీవీల ధరలు పెరిగే అవకాశముందని ప్యానసోనిక్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీష్‌ శర్మ చెప్పుకొచ్చారు. ఇక టీవీ ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదని హయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రాగంజా అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లో 32 ఇంచ్‌ల టీవీ ధర రూ.5000 నుంచి రూ.6000 మధ్య పెరిగే అవకాశం ఉందని అర్జున్‌ బజాజ్‌ తెలిపారు. మొత్తం టీవీ తయారీలో 60 శాతం కేవలం ఓపెన్‌ సెల్‌ ప్యానెల్స్‌కు ఖర్చు కావడమే టీవీల ధరల ఈ రేంజ్‌లో పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెల్‌ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Honda CB350 RS: భారత్‌లో మొదలైన హోండా కొత్త బైక్‌ డెలివరీలు.. రూ.2 లక్షల బైక్‌ ఫీచర్స్‌ తెలిస్తే..

Ola Elecric Scooter : సింగిల్ చార్జిపై 240 కిలోమీట‌ర్లు.. త్వరలో ఓలా నుంచి స్మార్ట్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

కొత్తగా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 1 లక్ష వరకు తగ్గింపు.!! వివరాలివే.!