Lava Wireless Earbuds: భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా గత కొంతకాలంగా సరికొత్త ఫోన్లతో.. గాజ్డేట్స్ తో యూత్ ను ఆకర్షించడానికి .. తన మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో లావా కంపెనీ ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్ ను అందిస్తున్నామని ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి (జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి) లావా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.
వైర్‌లెస్ విభాగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించామని లావా యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులను అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటినిలాంచ్ చేయమని చెప్పింది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు, ఆన్ లైన్ క్లాసెస్ ఉన్నవారి అవసరాలను తీరుస్తాయని లావా మొబైల్స్ పేర్కొంది.అయితే ఈ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను అతి తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను లావా ప్రోబడ్స్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. నిజానికి వీటి ధర రూ. 2199గా ఉంది. అయితే వీటిని మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్న సందర్భంగా వినియోగదారులకు ప్రతీక ఆఫర్‌లో రూ.1కే అందిస్తోంది. అయితే స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది.
Also Read: 60 ఏళ్లకు పెన్షన్ పొందాలనుకుంటున్నారా అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో చేరితే సరి..