X-Men EV scooter: మార్కెట్‌లో అతి తక్కువ ధరతో ఎక్స్-మెన్ స్కూటర్ లాంచ్.. సూపర్ ఫీచర్లు తెలిస్తే షాక్
తాజాగా ప్రముఖ ఈవీ టూ-వీలర్ స్టార్టప్ అయిన జీలియో ఈ-బైక్స్ సరికొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ మెన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త లాంచ్ వారి వినూత్న ఉత్పత్తి శ్రేణిని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను ఐదు ప్రత్యేకమైన వేరియంట్లలో లాంచ్ చేశారు. వేరియంట్‌కు అనుగుణంగా ఈ స్కూటర్ల ధరలు రూ. 64,543 నుంచి రూ. 87,573 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.

భారతదేశంలో ఈవీ రంగం రోజురోజుకీ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు వాడే వారి సంఖ్య గణనీయంగా వృద్ది చెెందుతుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు భారతీయులను ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్స్‌తో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈవీ టూ-వీలర్ స్టార్టప్ అయిన జీలియో ఈ-బైక్స్ సరికొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ మెన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త లాంచ్ వారి వినూత్న ఉత్పత్తి శ్రేణిని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను ఐదు ప్రత్యేకమైన వేరియంట్లలో లాంచ్ చేశారు. వేరియంట్‌కు అనుగుణంగా ఈ స్కూటర్ల ధరలు రూ. 64,543 నుంచి రూ. 87,573 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో మెన్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎక్స్ మెన్ స్కూటర్ సులభంగా హ్యాండిల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెతుకుతున్న పాఠశాల విద్యార్థులు, కళాశాలకు వెళ్లేవారికి అనువుగా ఉంటుంది. ఈ లాంచ్ పై జీలియో ఈ-బైక్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ ఎక్స్ మెన్ స్కూటర్ అత్యుత్తమ పనితీరుతో అందరినీ ఆకర్షిస్తుందని చెప్పారు. ఈ స్కూటర్లు శక్తివంతమైన 60/72వీ బీఎల్‌డీసీ మోటారుతో వస్తాయి. అలాగే సమర్థవంతమైన పనితీరు కోసం ఒక్కో ఛార్జీకి కేవలం 1.5 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే తీసుకుంటాయి. ఈ స్కూటర్ బరువు 80 కిలోలు ఉన్నప్పటికీ ఈ స్కూటర్లు 180 కిలోల లోడింగ్ సామర్థ్యంతో వస్తాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ ఎంట్రీ-లెవల్ మోడల్ 60వీ/32 ఏహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 64,543గా ఉంది. అలాగే ఈ స్కూటర్ 55-60 కిమీ మైలేజ్ పరిధితో పాటు 7-8 గంటల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు.
అలాగే 72వీ/32 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూట్ ధర రూ. 67,073గా ఉంది. అలాగే 7-9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 కి.మీ పరిధిని అందిస్తుంది. 60వీ/32ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో కూడిన టాప్ మోడల్ ధర రూ. 87,573గా ఉంది. ఇది 80 కి.మీల ఆకట్టుకునే రేంజ్‌తో వస్తుంది. అలాగే కేవలం నాలుగు గంటల్లోని పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ స్కూటర్‌లో యాంటీ-థెఫ్ట్ అలారం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు, వెనుక డ్రమ్ బ్రేక్లు ఆకట్టుకుంటాయి. అలాగే రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్, ముందు, వెనుక రెండింటికీ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు, డిజిటల్ డిస్ ప్లే, సెంట్రల్ లాకింగ్ ఫీచర్లు ఈవీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








