Special FD Scheme: ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు.. ఏకంగా 8.05శాతం వడ్డీ.. మిస్ చేసుకోవద్దు..

|

Feb 04, 2024 | 6:51 AM

ప్రముఖ ప్రభుత్వ రంగ రుణదాత అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎస్బీ), రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ పరిమిత కాలానికి మాత్రమే అధిక వడ్డీతో ప్రత్యేక ఎఫ్డీ పదవీకాలాన్ని పొడిగించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు 2024, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Special FD Scheme: ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు.. ఏకంగా 8.05శాతం వడ్డీ.. మిస్ చేసుకోవద్దు..
Fixed Deposit
Follow us on

ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. వీటిపై స్థిరమైన రాబడి వస్తుండటంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పోటాపోటీగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఉన్న ప్రజాకర్షక స్పెషల్ ఎఫ్‌డీ పథకాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రభుత్వ రంగ రుణదాత అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎస్బీ), రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ పరిమిత కాలానికి మాత్రమే అధిక వడ్డీతో ప్రత్యేక ఎఫ్డీ పదవీకాలాన్ని పొడిగించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు 2024, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తాజా ఎఫ్ డీ వడ్డీ రేట్లు..

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఫిబ్రవరి 1, 2024 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. సాధారణ పౌరులకు సవరణ తర్వాత 2.80% నుంచి 7.40% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు రూ.2కోట్ల కంటే తక్కువ టర్మ్ డిపాజిట్లపై 0.50% అదనపు వడ్డీ ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో సూపర్ సీనియర్ సిటిజన్‌లు 444 రోజుల వ్యవధిలో అత్యధికంగా 8.05% వడ్డీ రేటును పొందుతారు.

సాధారణ పౌరుల వడ్డీ రేట్లు ఇలా..

  • 7 నుంచి 30 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 2.8శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • 31 నుంచి 45 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 3 శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • 46 నుంచి 120 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 4.25శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • 121 నుంచి 179 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 4.75శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • 180 నుంచి 221 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 5.25శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • అలాగే 222 రోజుల కాల వ్యవధితో చేసే ఎఫ్డీ పై 7శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
  • 223 నుంచి 269 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 5.25 శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • 270 నుంచి 332 రోజుల కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 5.5శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • 333 కాలవ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్ డీ పై 7.15శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.
  • 444 రోజుల కాల వ్యవధితో చేసే రూ. 2కోట్ల లోపు విలువైన ఎఫ్డీ పై 7.40శాతం వడ్డీ రేటు ఈ బ్యాంక్ అందిస్తుంది.

ఇది స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్..

పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ లో 444 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ ప్రత్యేక పదవీకాలం మార్చి 31, 2024 వరకు మాత్రమే అందుబాటు ఉంటుంది. దీనికి కనీస డిపాజిట్ రూ. లక్ష ఉండాలి. సీనియర్ సిటిజెన్స్ పై 0.50శాతం అదనంగా వడ్డీ వస్తుంది. అదే సమయంలో సూపర్ సీనియర్స్(80ఏళ్లు పైబడిన వారు) దానిపై మరో 0.15శాతం అదనంగా వడ్డీ అందుతుంది. అంటే సీనియర్ సిటీజెన్స్ కు 7.90శాతం, సూపర్ సీనియర్ సిటీజెన్స్8.05శాతం వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..