Petrol Diesel Price: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య జరిగే జరిగే యుద్ధం పలు ధరలపై ఎఫెక్ట్ పడుతోంది. ఈ యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. యుద్ధం కారణంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక తాజాగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ (LIOC) ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్‌పై రూ.75 పెంచుతున్నట్లు వెల్లడించింది. ధరను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరుకోగా, లీటర్ డీజిల్ ధర రూ.214కు చేరుకుంది.
మరో వైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఎల్‌ఐవోసీ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.57కి తగ్గింది. శ్రీలంక రూపాయి పడిపోవడం గత వారం రోజుల్లో ఇది రెండో సారి. నెల రోజుల వ్యవధిలో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. అయితే ఈ ధరల పెంపుపై శ్రీకలం ప్రభుత్వం ఎలాంటి రాయితీ ఇవ్వలేదని, దీంతో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా కంపెనీ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని ఎల్‌ఐవోసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు.
ఇవి కూడా చదవండి: