Kotak Mahindra Bank: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్..?
Kotak Mahindra Bank: భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు. తమ డబ్బులు ఎక్కడ పెట్టుబడిపెడితే
Kotak Mahindra Bank: భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు. తమ డబ్బులు ఎక్కడ పెట్టుబడిపెడితే భద్రంగా ఉంటాయో ఆరా తీస్తూ ఉంటారు. చాలామంది బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఎందుకుంటే ప్రభుత్వ నుంచి సెక్యూరిటీ, మంచి రాబడి వస్తోందని నమ్ముతారు. అయితే అన్ని బ్యాంకులు వడ్డీలు ఒకే విధంగా చెల్లించవు. కొన్ని బ్యాంకులు అధికంగా వడ్డీ చెల్లిస్తాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా ప్రాముఖ్యత కల్పించింది. సెప్టెంబర్ 8 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.
కొత్త వడ్డీ రేట్లు గతంలో 7 నుంచి 30 రోజుల FD లపై 2.5 శాతం, 31 నుంచి 90 రోజుల FD లపై 2.75 శాతం వడ్డీ లభించేది. తాజాగా మారిన వడ్డీ రేట్ల ప్రకారం.. 91-120 రోజుల FDలపై 3 శాతం వడ్డీ రేటు,121-179 రోజుల FDలపై 3.25 శాతం వడ్డీ రేటు,180-269 రోజుల FD లపై 4.25 శాతం, 270-364 FD లపై 4.4 శాతం, 365-389 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం, 390 రోజుల కంటే ఎక్కువ రోజులు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తుంది. 7-14 రోజులFDలపై 3 శాతం వడ్డీరేటును చెల్లిస్తుంది.180 రోజుల్లో మెచ్యూరిటీ అయ్యే FD లకోసం 4.75 శాతం, 364 రోజుల FD లపై సీనియర్ సిటిజన్లకు 4.9 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సవరించిన రేట్ల ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ 23 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని పొందుతారు.