Koo India: ఎలాన్ మస్క్‌కు Koo సీఈవో ట్వీట్.. అందుకు సిద్ధమన్న దేశీయ స్టార్టప్..

|

Apr 12, 2022 | 7:49 PM

Koo India: ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్ కంపెనీ బోర్డులో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ Koo CEO మస్క్ కు ట్వీట్ చేశారు. అందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్టప్ వెల్లడించింది.

Koo India: ఎలాన్ మస్క్‌కు Koo సీఈవో ట్వీట్.. అందుకు సిద్ధమన్న దేశీయ స్టార్టప్..
Koo
Follow us on

Koo India: ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్ కంపెనీ బోర్డులో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ Koo CEO అప్రమేయ రాధాకృష్ణ, కూకు షాట్ ఇవ్వమని టెక్ బిలియనీర్‌ను కోరుతూ ట్వీట్ చేశారు. రాధాకృష్ణ తన ట్వీట్‌లో, “మేము యువకులం, చురుకుదనంతో పాటు పెద్ద కలలు కలిగి కంటున్నాము! కూని సోషల్ మీడియా @kooindia భవిష్యత్తుగా నిర్మిస్తున్నాము” అని అన్నారు. రాధాకృష్ణ భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో చేరమంటూ ఎలాన్ మస్క్ ను ఆకర్షించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో మస్క్ పోస్ట్ చేసిన ట్విట్టర్ పోల్‌కు రాధాకృష్ణ సమాధానమిస్తూ.. ప్రపంచంలోని పెద్ద సంఖ్యలో ఇంగ్లీష్ యేతర ప్రేక్షకులకు Koo ప్లాట్‌ఫారమ్ వాయిస్ ఇస్తోందని అన్నారు. కూలో చేరాలని మస్క్‌ని కోరారు.

ప్రభుత్వం ఆమోదించిన ID కార్డ్‌ని ఉపయోగించి వినియోగదారులందరూ స్వచ్ఛందంగా తమ ఖాతాలను స్వీయ-ధృవీకరణ చేసుకోవడానికి Koo ఇప్పటికే అనుమతించిందని భారతీయ పారిశ్రామికవేత్త నొక్కి చెప్పారు. ఇది మస్క్ మునుపటి ట్వీట్‌కు సూచనగా ఉంది. ఇక్కడ అతను ట్విట్టర్‌తో సహా అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు వారి గుర్తింపులను స్వీయ-ధృవీకరణ ఎంపికను అందించాలి అనే భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. Twitter సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ Twitter బ్లూ వినియోగదారులకు అథెంటికేషన్ గుర్తును ఇవ్వాలని మస్క్ సూచించారు.

2020లో ప్రారంభించబడిన కూ ఇండియా, నైజీరియాలో 20 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. గత ఏడాది ట్విట్టర్‌ని ఏడు నెలల పాటు నిషేధించారు. భారతీయ స్టార్టప్ కూ.. మిరే అసెట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, డ్రీమ్ ఇంక్యుబేటర్‌తో సహా మార్క్యూ పెట్టుబడిదారుల నుంచి ఇప్పటి వరకు 44 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను సేకరించింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎలా లెక్కిస్తారో తెలుసా..

Marriage Insurance: పెళ్లి వేడుకలకూ ఇన్సూరెన్స్ ఉంది తెలుసా? పూర్తి వివరాలు..