Viral: వామ్మో.! 25 లక్షల కోట్లు ఏంటీ మేడమ్.. పుడితే ఇలాంటి ఫ్యామిలీలోనే పుట్టాలి

|

Nov 15, 2024 | 8:11 AM

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీ.. వేల కోట్ల విలువ చేసే ప్యాలస్.. వందల కొద్దీ భవనాలు.. సొంతంగా చమురు బావులు.. ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు.. ఇలా ఒకటా రెండా. లక్షల కోట్ల ఆస్తులు..

Viral: వామ్మో.! 25 లక్షల కోట్లు ఏంటీ మేడమ్.. పుడితే ఇలాంటి ఫ్యామిలీలోనే పుట్టాలి
Richest Family
Follow us on

వేల కోట్ల విలువ చేసే ప్యాలస్.. వందల కొద్దీ భవనాలు.. సొంతంగా చమురు బావులు.. ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు.. ఇలా ఒకటా రెండా. లక్షల కోట్ల ఆస్తులు ఆ కుటుంబం సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం అది. అదే అబుదాబికి చెందిన అల్ నహ్యన్ రాచ కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఆస్తులు 300 బిలియన్ డాలర్లకు పైనే. అంటే మన కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

అల్ నహ్యన్ కుటుంబం నివసించే రాజ భవనం ‘ఖసర్ అల్ వతన్’ ప్యాలెస్ విలువ 4 వేల కోట్లకుపైనే ఉంటుంది. అందులో ఉండే ఒక షాండ్లియర్‌లో ఏకంగా 3.5 లక్షల రత్నాలు పొదిగి ఉండటం విశేషం. అల్ నహ్యన్ కుటుంబానికి లండన్, పారిస్ సహా ప్రపంచంలోని చాలా ప్రముఖ నగరాల్లో భారీ సంఖ్యలో భూములు, భవనాలు ఉన్నాయి. ఈ కుటుంబంలోని వారు ప్రయాణించేందుకు.. దేశంలో, విదేశాలకు రాకపోకలు సాగించేందుకు సొంతంగా ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు ఉన్నాయి. ఈ కుటుంబానికి సొంతంగా ఒక ఫుట్ బాల్ క్లబ్ కూడా ఉంది. అక్కడ ఫుట్ బాల్ లీగ్ లలో పోటీ పడుతుంటారు. అల్ నహ్యన్ రాచ కుటుంబం అధీనంలో ఉన్న చమురు నిల్వలు.. మొత్తం ప్రపంచంలో ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం చమురు నిల్వలు ఈ రాజు సొంతం.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయట. ఈ కుటుంబానికి సంబంధించిన పెట్టుబడుల వ్యవహారాలను ‘టానౌన్ బిన్ జాయేద్ అల్ నహ్యన్’ చూసుకుంటారు. ఈ కుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హందాన్ కు కార్లు అంటే ఇష్టం. ఆయన వద్ద బుగాటీ వేరాన్, లాంబోర్గిని, ఫెరారీ, మెక్ లారెన్ కంపెనీలు సహా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 700 కార్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటి విలువ ఒక్కోటీ రూ.5 కోట్లపైనే ఉంటుందట.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..