
డబ్బు దాచుకోవడానికి చాలామందికి సేఫ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది బ్యాంకే. తమ దగ్గరున్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్‌లు వేసి అవి వడ్డీతో సహా అలా పెరుగుతుంటాయిలే అనుకునేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పిల్లల చదువులని, పెళ్లిళ్లకు అక్కరకొస్తాయని ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు వేస్తుంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి ఓ 10ఏళ్ల పాటు దాన్ని అలా వదిలేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? 10 సంవత్సరాల వరకు మీరు ఆ డబ్బును ముట్టకపోతే బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా.? అసలు ఎవరు ముట్టని డబ్బు బ్యాంకుల్లో ఎంత మూలుగుతుందో తెలుసుకుందామా..
ఇన్సూరెన్స్: ఏజెంట్లు అమ్మిన పాలసీల్లో 80% అన్‌క్లెయిమ్డ్ డబ్బే.
లైఫ్ ఇన్సూరెన్స్- రూ. 2.50 లక్షల కోట్లు
LICలో – రూ.1లక్షా 57వేల 533.4 కోట్లు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ – రూ. 915 కోట్ల 80 లక్షలు
రిలయన్స్- రూ.299కోట్ల 40 లక్షలు
ఎస్‌బీఐ రూ. 235కోట్ల 73 లక్షలు
జనరల్ ఇన్సూరెన్స్ – రూ.3వేల కోట్లు
ఐసీఐసీఐ లాంబార్డ్ రూ.506 కోట్ల 84 లక్షలు
యూనైటెడ్ ఇన్సూరెన్స్ రూ.217 కోట్ల 15 లక్షలు
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ రూ.175 కోట్ల 92 లక్షలు
నేషనల్ ఇన్సూరెన్స్ రూ.166 కోట్ల 64 లక్షలు
బ్యాంకులు – రూ.78213 కోట్లు
ఇక సెబీ విషయానికొస్తే.. మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో రూ.323 కోట్లు, సెక్యూరిటీస్ రూ.183 కోట్లు ఉన్నాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్స్‌లో రూ.22వేల కోట్లు ఉన్నట్టు సమాచారం. గత ఏడాదిలో రూ. 10, 185 కోట్లు క్లియర్ చేశారు. 60లక్షల49వేల మందికి ఇచ్చేశారు. ఇలా ‘అన్‌క్లెయిమ్డ్ మనీ’ని జీరో చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అయితే ఎవరు క్లెయిమ్ చేసుకొని డబ్బు ప్రతి ఏటా 26% పెరుగుతోందని అంచనా.
మీరు ఏదైనా బ్యాంక్ నుండి హోమ్ లోన్ తీసుకుంటే దురదృష్టవశాత్తూ మీరు మరణించిన తర్వాత.. ఆ లోన్ రీపే చేయలేకపోతే బ్యాంకులు మీ వారసులను వెతికిమరీ వారిని లోన్ రీపే చేయలాని సమాచారం ఇస్తాయి. అదే బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే మీ మరణానంతరం మీ వారసులకు ఆ డిపాజిట్ సమాచారాన్ని బ్యాంకులు ఇవ్వవు. చాలామంది తమ అవసరాల కోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. అలాగే కొంత మొత్తం నగదును కూడా ఆ ఖాతాల్లో వేస్తారు. కుటుంబ సభ్యుల పేర్లపై కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదు డిపాజిట్లు వేస్తారు. అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహించలేక అలాగే వదిలేస్తుంటారు. కొందరు వాటిని మరిచిపోతారు.
దురదృష్టవశాత్తూ మరణిస్తే.. ఆ డిపాజిట్ల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకుంటే వాటిని ఎవరూ తీసుకోలేరు. అంటే ఆ ఖాతాలు అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోతాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అన్ క్లైమ్డ్ డిపాజిట్లు మూలుగుతున్నాయి. అయితే డిపాజిట్ వేసిన డబ్బును అప్పుడప్పుడు క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. డిపాజిట్ వేసిన ఖాతా నుంచి లావాదేవీలు జరుపుతూ ఉండాలి. అలా కాకుండా ఆ డబ్బును అలాగే 10ఏళ్ళు వదిలేస్తే దాని మీద హక్కు కోల్పోతారు. క్లెయిమ్ చేయని డిపాజిట్లన్నీ అన్-క్లెయిమ్ డిపాజిట్‌గా పరిగణించబడతాయి. ఇలా వ్యక్తులు అర్హత కోల్పోయాక ఆ డబ్బును రిజర్వ్ బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది. కాగా, ఈ ‘అన్‌క్లెయిమ్డ్ మనీ’లో మీ డబ్బు కూడా ఉంటే.. ఉద్గమ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి. ఈ పోర్టల్‌లో 29 బ్యాంకులు నమోదయ్యాయి. ఇందులో మీ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి.. మీ సంబంధీకుల ఖాతాలలో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయేమో చూడొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..