Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్‌ గురించి మీకు తెలుసా?

రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ను ఆయన విజయ రహస్యం ఏమిటని అడిగినప్పుడల్లా ఆయన తన లక్ష్యానికి కట్టుబడి ఉండటం గురించి మాట్లాడుతారు. జరగని విషయాల గురించి ఆలోచించి..

Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్‌ గురించి మీకు తెలుసా?

Updated on: Jul 24, 2025 | 5:09 PM

Mukesh Ambani Lifestyle: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ లైఫ్‌ స్టైల్‌ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఆయన దిచ చర్య ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ను ఆయన విజయ రహస్యం ఏమిటని అడిగినప్పుడల్లా ఆయన తన లక్ష్యానికి కట్టుబడి ఉండటం గురించి మాట్లాడుతారు. జరగని విషయాల గురించి ఆలోచించే బదులు భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన నమ్ముతారు. అందుకే 68 సంవత్సరాల వయస్సులో ఆయన కోట్లాది మంది యువతకు ఒక ఆదర్శం.

ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్‌ కారు.. 6 ఎయిర్‌ బ్యాగ్స్‌.. చౌకైన కారు

మీరు కూడా ముఖేష్ అంబానీ లాగా విజయం సాధించడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జీవితంలో ముందుకు సాగడానికి తన తండ్రే అతిపెద్ద ప్రేరణ అని ఆకాష్ చెప్పాడు. ఆయన తన కుటుంబంతో పాటు తన పనిని కూడా సరైన రీతిలో నిర్వహిస్తారన్నారు.

ఇవి కూడా చదవండి

ముఖేష్ అంబానీ పడుకునే ముందు చేసే పని ఇదే..

ముఖేష్ అంబానీ రాత్రి 2 గంటల వరకు నిద్రపోరని ఆకాష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 40 సంవత్సరాలుగా ప్రతి మెయిల్‌ను స్వయంగా చదివి స్వయంగా సమాధానం ఇస్తారని అన్నారు. ఈ అలవాటు కొన్నిసార్లు అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఇంత వయసు వచ్చినప్పటికీ తన జీమెయిల్‌కు వచ్చిన మెయిల్స్‌ అన్ని కూడా చదివి రిప్లే ఇస్తారని అన్నారు. అతని షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయినా తన పని పూర్తి చేసే వరకు నిద్రపోరని అన్నారు.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..

ముఖేష్ అంబానీ నికర విలువ:

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 16వ ధనవంతుడు. అతని మొత్తం నికర విలువ $107.3 బిలియన్లు.

నీతా అంబానీ గురించి..

ఈ సమయంలో ఆకాష్ అంబానీ తన తల్లి నీతా అంబానీని ప్రశంసిస్తూ, ఆమె పని పట్ల ఎంతో మక్కువ చూపిస్తారని, వ్యాపారం అయినా, క్రికెట్ అయినా ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా అమ్మ ప్రతిదీ గమనిస్తుంది.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. తల్లిదండ్రులు పనికి అంకితభావంతో ఉన్న విధానం పిల్లలు పని చేయడానికి కూడా ప్రేరణనిస్తుందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి