AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers: రైతులకు కేంద్రం సూపర్ న్యూస్.. రూ.3 లక్షల వరకు లోన్.. వడ్డీ అతి తక్కువ..

కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తోంది. అలాగే రైతులకు కూడా తక్కువ వడ్డీకే ఎలాంటి పూచీకత్త లేకుండా రుణాలు అందిస్తోంది. రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు.

Farmers: రైతులకు కేంద్రం సూపర్ న్యూస్.. రూ.3 లక్షల వరకు లోన్.. వడ్డీ అతి తక్కువ..
Money
Venkatrao Lella
|

Updated on: Jun 02, 2026 | 3:09 PM

Share

రైతులకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల చొప్పున నగదు అందించడంతో పాటు ఎరువులు, వ్యవసాయ పరికరాలపై రాయితీలు అందిస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా తక్కువ అడ్డీకే రుణం అందిస్తోంది. ఇందుకోసం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందుకు ఎటువంటి పూచీకత్తు కూడా అవసరం లేదు. ఈ లోన్ పొందేందుకు అర్హతలు ఏంటి..? ఎలా పొందాలి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది..?

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అవసరం ఉన్నప్పుడు వీటిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. వీటికి వడ్డీ రేటు 7 శాతం ఉంటుంది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తే కేంద్రం రాయితీ కల్పిస్తోంది. వ్యవసాయం, పశుపోషణ, డెయిరీ, పాల్ట్రీ, ఫిషరీస్ వంటి రంగాల్లోని రైతులకు ఈ పథకం వర్తిస్తుంది

పథకం ప్రయోజనాలు

-కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్

-సకాలంలో చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ

-పశు సంవర్థం, మత్స్య పరిశ్రమ కోసం తీసుకునే రుణాలపై రూ.2 లక్షల వడ్డీ రాయితీ

అర్హతలు ఏంటి..?

-వయస్సు 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి

-సొంత భూమి కలిగి వ్యవసాయం చేస్తూ ఉండాలి

-పాడి, చేపలు, కోళ్ల రైతులు కూడా అర్హులు

-స్వయం సహాయక సంఘాలు, లయబిలిటీ గ్రూపులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

-రూ.3 లక్షల వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే వడ్డీ రాయితీ ఉంటుంది

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

-గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్, పాన్, ఓటర్ ఐడీలలో ఏదైనా సమర్పించాలి

-అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం

-భూమి రికార్డులు, పట్టాదారు పాస్ బుక్ అవసరం

-బ్యాంక్ అకౌంట్ వివరాలు

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

సమీపంలోని బ్యాంక్‌కు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫారంను నింపి సిబ్బందికి అందించాలి. బ్యాంక్ అధికారులు పరిశీలించి మీకు కార్డు జారీ చేస్తారు. అలాగే బ్యాంక్ వెబ్ సైట్లు, యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రూపే కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Follow Us