Cars: లీజుకు కియా కొత్త కార్లు.. నెలకు కేవలం రూ. 20 వేలు మాత్రమే..

ఎలాంటి అడ్వాన్స్‌ చెల్లించకుండానే కారును లీజు తీసుకోవచ్చు. కారు లీజ్‌ సేవలను ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, పుణెల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌తో డీల్ కుదుర్చుకుని..కియా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 నుంచి 60 నెలల వ్యవధిలో కార్లను లీజుకు తీసుకోవచ్చు...

Cars: లీజుకు కియా కొత్త కార్లు.. నెలకు కేవలం రూ. 20 వేలు మాత్రమే..
Kia Cars Rent

Updated on: May 18, 2024 | 2:06 PM

కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశతో ఉంటారు. అయితే ఈఎమ్‌ఐలు చెల్లించడం, ఇన్సూరెన్స్‌ చెల్లించడం, నిర్వహణ వ్యయాలు భరించడం వంటి సమస్యలు ఉంటాయి. అందుకే కొత్త కారు కొనాలని ఉన్నా వెనుకడుగు వేస్తుంటారు. మరి కొత్త కారులో షికారు చేయాలనే కోరిక ఎలా నెరవేర్చుకోవాలి.? ఇందుకోసమే ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ కియా కొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది. కొత్త కార్లను లీజు తీసుకునే వెసులుబాటును కల్పించింది.

ఎలాంటి అడ్వాన్స్‌ చెల్లించకుండానే కారును లీజు తీసుకోవచ్చు. కారు లీజ్‌ సేవలను ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, పుణెల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌తో డీల్ కుదుర్చుకుని..కియా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 నుంచి 60 నెలల వ్యవధిలో కార్లను లీజుకు తీసుకోవచ్చు. ఎలాంటి అడ్వాన్స్‌ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక కార్ల విషయానికొస్తే.. కియా సోనెట్ కారుకు అయితే నెలకు రూ. 21,900; కియా సెల్టోస్‌కు రూ. 28,900, కారెన్స్ కారుకు రూ. 28,800 వరకు రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. కార్లను లీజు తీసుకోవడం వల్ల కార్ మెయింటెనెన్స్, టాక్స్‌లు, ఇన్సూరెన్స్ అన్నీ మీరు చెల్లించేటువంటి నెలవారీ సభ్యత్వ రుసుములోనే కవర్ అయిపోతుంటాయి. అందుకే ఎక్స్‌ట్రా రుసుము కట్టనక్కర్లేదు.

నెలకొకసారి మీకు నచ్చిన కారులో తిరిగే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. కారును లీజ్‌ చేసుకున్న తర్వాత తర్వాత మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా లభిస్తుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న మోడల్ వదులుకొని.. కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..