Kia Cars: ‘కియా’ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. సెల్టోస్ నుంచి ఈవీ6 వరకు ధరలు ఇలా ఉన్నాయి..

|

Jan 06, 2023 | 3:43 PM

కొత్త సంవత్సరంలో కస్టమర్లకు కియా బిగ్ షాక్ ఇచ్చింది. తన కంపెనీ కార్ల ధరను భారీగా పెంచింది. పెంచిన ధరలు జనవరి 1, 2023 నుంచే అమల్లోకి వచ్చాయి. కియా ఇండియా తన కార్ల ధరలను..

Kia Cars: ‘కియా’ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. సెల్టోస్ నుంచి ఈవీ6 వరకు ధరలు ఇలా ఉన్నాయి..
Kia Cars
Follow us on

కొత్త సంవత్సరంలో కస్టమర్లకు కియా బిగ్ షాక్ ఇచ్చింది. తన కంపెనీ కార్ల ధరను భారీగా పెంచింది. పెంచిన ధరలు జనవరి 1, 2023 నుంచే అమల్లోకి వచ్చాయి. కియా ఇండియా తన కార్ల ధరలను దాదాపు రూ. 1 లక్షల వరకు పెంచింది. కియా కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బే. కియా ఈవీ6 మోడల్‌కు గరిష్టంగా ధర పెంచగా.. కనిష్టంగా కియా సెల్టోస్ ధర పెంచింది. కియా కంపెనీ ఏ మోడల్ కారుపై ఎంత ధర పెంచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కియా EV6 ధర..

కియా ఎలక్ట్రిక్ కారు RWD, AWD వేరియంట్ల ధర రూ. 1 లక్ష వరకు పెంచారు. పెంచిన ధరతో కలిపి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ల ధర రూ. 60.95 లక్షలకు పెరిగింది. అయితే, ఇది ప్రారంభ ధర మాత్రమే. హైఎండ్ కార్ల ధర రూ. 65.95 వేలుగా ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్‌ షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్‌రోడ్ ప్రైజ్ వేరే ఉంటుంది.

కియా కార్నివాల్ ధర..

కియా కార్నివాల్ ధరను కంపెనీ పెంచలేదు. ఈ కారు ధర మునుపటిలాగే రూ. 30.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హైఎండ్ మోడల్ ధర రూ. 35.49 లక్షలుగా ఉంది. ఆన్‌రోడ్ ప్రైజ్‌తో కలిపితే ధర మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కియా సెల్టోస్ ధర..

ఈ కారు 1.4L టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 40 వేలు పెరిగింది. అదే సమయంలో 1.5L NA పెట్రోల్ వేరియంట్‌పై రూ. 20,000 వరకు పెరిగింది. ఇక కియా సెల్టోస్ 1.5లీ డీజిల్ వేరియంట్ ధర రూ.50 వేలు పెరిగింది.

కియా కేరెన్స్ ధర..

ఈ కారు ధరను రూ. 20,000 పెంచింది కియా కంపెనీ. అయితే ఈ పెరుగుదల 1.5L NA పెట్రోల్ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. అదే సమయంలో, 1.4L టర్బో పెట్రోల్ వేరియంట్ ధర 25 వేల రూపాయలు పెరిగింది. కాగా, ఈ కారు డీజిల్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 45,000 పెంచింది. ఇక ఈ కారు ధర ఇప్పుడు రూ. 10.20 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. హైఎండ్ ధర రూ. 18.45 లక్షల(ఎక్స్‌-షోరూమ్) వరకు ఉంది.

కియా సోనెట్ ధర..

ఈ అత్యంత సరసమైన ధరకే లభించే కియా సోనెట్ ధర కూడా భారీగా పెరిగింది. 1.0లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 25 వేలు పెరగగా.. డీజిల్ వేరియంట్ ధర రూ. 40 వేలు పెరిగింది. 1.2లీటర్ NA పెట్రోల్ వేరియంట్ ధర రూ.20 వేలు పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..