Train Ticket: మీరు రైలులో స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఎలాగంటే?

దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే.. ట్రైన్ జర్నీ అనేది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణం..

Train Ticket: మీరు రైలులో స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఎలాగంటే?
Train
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 06, 2023 | 1:55 PM

దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే.. ట్రైన్ జర్నీ అనేది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణం ఖరీదైనదిగా ఉంటుందని.. చాలామంది స్లీపర్ క్లాస్‌లోనే ట్రావెల్ చేస్తుంటారు. అయితే మీకెప్పుడైనా స్లీపర్ క్లాస్‌కు బదులుగా థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుని ఉంటే బాగుండేదని అనిపించిందా.? ఇది మీకోసమే. మీరు స్లీపర్ కాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు. అది కూడా స్వల్ప మార్పులతో ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు.

ప్రయాణీకుల అవసరాల దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ టికెట్ విధానంలో పలు కీలక మార్పులు చేసింది. ప్రయాణం మధ్యలోనే కోచ్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మీరు స్లీపర్ క్లాస్ టికెట్‌తో ప్రయాణిస్తున్నప్పుడే.. మీ రిజర్వేషన్‌ను థర్డ్ ఏసీ లేదా సెకండ్ ఏసీ కోచ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. మీరు ముందుగా రైలులో ఉన్న టీటీఈని సంప్రదించాలి. థర్డ్ ఏసీ లేదా సెకండ్ ఏసీలో బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లయితే.. వాటిని టీటీఈ మీకు కేటాయిస్తారు. అయితే దీనికోసం కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్ నుంచి ఏసీ కోచ్‌కు మారాలనుకున్నప్పుడు.. మీరు స్లీపర్ క్లాసుకు చెల్లించిన మొత్తాన్ని ఏసీ టికెట్ ధర నుంచి తీసేసి.. మిగతా డబ్బును చెల్లించాలి. ఒకవేళ మీరు మారాలనుకున్న బోగీలో బెర్త్ ఖాళీ లేకపోతే.. మీ టికెట్ అప్‌గ్రేడ్ కావడం కుదరదు. సేమ్ బెర్త్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.