EPFO Rules: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు ఈపీఎఫ్ఓ కీలక చర్యలు.. యూఏఎన్ ఫ్రీజ్ చేసే అవకాశం

|

Jul 09, 2024 | 3:41 PM

సాధారణంగా భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి రిటైర్‌మెంట్ సమయం తర్వాత వారికి ఆర్థికంగా మేలు చేయడానికి  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కొంత సొమ్మును పొదుపు చేస్తున్నారు. ఇవి వారి ఆర్థిక అవసరాలను తీర్చడమేకాక రిటైర్‌మెంట్ సమయంలో నెలనెలా పింఛన్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అయితే ఇటీవల కాలంలో కొంత మంది కేటుగాళ్లు ఈపీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును కూడా తస్కరిస్తున్నారు.

EPFO Rules: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు ఈపీఎఫ్ఓ కీలక చర్యలు.. యూఏఎన్ ఫ్రీజ్ చేసే అవకాశం
Epfo
Follow us on

పెరిగిన టెక్నాలజీ మనకు ఎంత మేలు చేస్తుందో..? అదే స్థాయిలో కీడు చేస్తుంది. సాధారణంగా భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి రిటైర్‌మెంట్ సమయం తర్వాత వారికి ఆర్థికంగా మేలు చేయడానికి  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కొంత సొమ్మును పొదుపు చేస్తున్నారు. ఇవి వారి ఆర్థిక అవసరాలను తీర్చడమేకాక రిటైర్‌మెంట్ సమయంలో నెలనెలా పింఛన్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అయితే ఇటీవల కాలంలో కొంత మంది కేటుగాళ్లు ఈపీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును కూడా తస్కరిస్తున్నారు. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాలను ఫ్రీజింగ్, డీ-ఫ్రీజింగ్ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్‌ని రూపొందించింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన నయా సౌకర్యం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన ఖాతా ధ్రువీకరణను స్తంభింపజేయడానికి ఈపీఎఫ్ఓ ​​ద్వారా 30 రోజుల పరిమితిని సెట్ చేశారు. అయితే దానిని 14 రోజులకు పొడిగించవచ్చు. కాబట్టి జూలై 4న విడుదల చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ వినియోగదారుల కోసం సంస్థ జారీ చేసిన అన్ని కొత్త మార్గదర్శకాలను పరిశీలిద్దాం. అనుమానాస్పద ఖాతాలు లేదా వంచనలు లేదా మోసంతో కూడిన లావాదేవీల పరిస్థితులను సులభంగా గుర్తించడానికి ఈ కొత్త చర్యలు ఉపయోగపడతాయి. ఈపీఎఫ్ఓ ఎస్ఓపీలో భాగంగా ఎంఐడీ(సభ్యుల ఐడీ), యూఏఎన్‌లపై బహుళ దశల ధ్రువీకరణను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈపీఎఫ్ ఖాతాను స్తంభింపజేయడం అంటే?

  • యూనిఫైడ్ పోర్టల్‌కి లాగిన్ చేయాలి. 
  • అనంతరం కొత్త యూఏఎన్‌ను యాక్టివేట్ చేయడం లేదా ఇప్పటికే ఉన్న యూఏఎన్‌కు ఎంఐడీను లింక్ చేయాలి. 
  • సభ్యుల ప్రొఫైల్, కేవైసీ/ఎంప్లాయర్ డీఎస్సీలో ఏదైనా అదనంగా లేదా మార్పులు చేయాల్సి ఉంటుంది. 
  • ఎంఐడీలో  వీడీఆర్ స్పెషల్ లేదా వీడీఆర్ ట్రాన్స్‌ఫర్-ఇన్ మొదలైన వాటితో ఏదైనా డిపాజిట్‌లు సెలెక్ట్ చేసుకోవాలి. 
  • అక్కడ ఏదైనా క్లెయిమ్ సెటిల్మెంట్లు, ఫండ్ బదిలీలు లేదా ఉపసంహరణలు విభాగాన్ని క్లిక్ చేయాలి. 
  • ఇక్కడ పాన్ లేదా జీఎస్టీఎన్‌ ఉంటుది. ఇది యజమానికి సంబంధించిన ఆధార్/పాన్/డీఎస్సీతో  ఉంటుంది. అక్కడ్ క్లిక్ చేస్తే మన ఖాతా ఫ్రీజ్ అవుతుంది. 

డి-ఫ్రీజింగ్ అంటే 

ఈపీఎఫ్ఓ ప్రకారం రూపొందించిన వర్గాలు ఎంఐడీ, యూఏఎన్‌లు లేదా సమగ్ర ధ్రువీకరణ, డబ్బును భద్రపరచడానికి అవసరమైన సంస్థలకు చెందిన కేటగరీలు లేదా వ్యక్తిని వర్గీకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

కేటగిరీ-ఏ

ఆ ఎంఐడీలు/యూఏఎన్‌లు/స్థాపనలు గుర్తిస్తారు. అనంతరం ప్రధాన కార్యాలయం ద్వారా క్రమం తప్పకుండా సంప్రదిస్తారు. 

కేటగిరీ-బీ

ధ్రువీకరించిన సభ్యుడికి కాకుండా ఇతర వ్యక్తికి బదిలీ లేదా సెటిల్‌మెంట్ ద్వారా ఏదైనా మోసపూరిత ఉపసంహరణలను అనుభవించే సంస్థలు. ఇది సభ్యుని ప్రొఫైల్ లేదా కేవైసీకు సంబంధించిన ఏదైనా మార్పును కూడా కలిగి ఉంటుంది.

కేటగిరీ-సీ

ఏదైనా ఎంఐడీలు లేదా యూఏఎన్‌లు అపెండిక్స్ ఈ, వీడీఆర్ స్పెషల్, స్పెషల్ 10డీ, వీడీఆర్ ట్రాన్స్‌ఫర్-ఇన్ మొదలైన వాటి ద్వారా కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లేకుండా సమర్పించినా, లేదా జారీ చేసిన సూచనలను పాటించకపోతే అన్‌ఫ్రీజ్ చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..