Jitendra EV Yunik: 118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్

|

Jan 09, 2025 | 4:45 PM

భారతదేశంలో ఈవీ మార్కెట్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణ కోసం అంతా ఈవీల బాట పడుతున్నారు. దీంతో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీలు తమ ఈవీ వెర్షన్స్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈవీ స్కూటర్ భారత మార్కెట్‌లో లాంచ్ చేశారు. ఆ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Jitendra EV Yunik: 118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
Jitendra Ev Yunik
Follow us on

భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ జితేంద్రా  ఈవీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యూనిక్ పేరుతో మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.1.24 లక్షల ప్రారంభ ధరతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ డెలివరీలు జనవరి 15, 2025 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అలాగే జితేంద్రా కంపెనీ మరో రెండు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిక్ లైట్, యూనిక్ ప్రోలను కూడా మార్కెట్‌లో లాంచ్ చేయాలని యోచిస్తుంది. జితేంద్రా యూనిక్ ఈవీ విషయానికి వస్తే 3.8 కేడబ్ల్యూ ఎల్ఎంఎఫ్‌పీ రిమూవబుల్ బ్యాటరీతో ఈ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 118 కిమీల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. యునిక్ ఈవీ స్కూటర్ స్పిన్ స్విచ్ రైడింగ్ మోడ్లతో  మొదటి హైపర్ గేర్ పవర్ ట్రైన్‌తో వస్తుందని పేర్కొంటున్నారు. జితేంద్రా ఈవీ యూనిక్ గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వివరిస్తున్నారు. 

యూనిక్ ఈవీలో డ్యూయల్ డిస్క్ బ్రేక్లు, అల్లాయ్ వీల్స్‌తో కూడిన 12 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు, రైడర్ భద్రత కోసం సైడ్ స్టాండ్ సెన్సార్లతో వస్తుంది. కీలెస్ ఎంట్రీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, అధునాతన డిస్ ప్లేలతో కూడిన స్మార్ట్ డిజిటల్ ఎల్ఈడీ క్లస్టర్ వంటి ఫీచర్లతో వస్తుంది. క్రోమ్ ఏఆర్‌సీ ఎల్ఈడీ  హెడ్ ల్యాంప్‌లు, రేడియంట్ హెక్స్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఈగల్ విజన్ బ్లింకర్లు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ ఈవీ స్కూటర్ మెరుగైన రైడింగ్ అనుభవం కోసం స్మార్ట్ కనెక్టివిటీ, సహజమైన నియంత్రణలను అందించే జెనీ అప్లికేషన్ కనెక్టివిటీతో బ్లూటూత్  కనెక్టెడ్ బ్యాటరీతో వస్తుంది. 

యునిక్ ఈవీ బ్యాటరీ రెండింటి పై మూడు సంవత్సరాల లేదా 50,000 కిమీ వారెంటీతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ ఐదు రంగుల్లో లభిస్తుంది మీడో గ్రీన్, డస్క్ బ్లూ, ఫారెస్ట్ వైట్, వాల్కనో రెడ్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నాసిక్ ప్రాంతానికి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జితేంద్రా ఇంతకు ముందు రూ.79,999 ధరతో ప్రిమో ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. జితేంద్ర ఈవీ పైమో 60వీ, 26ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ 7 డిగ్రీ గ్రేడియంట్ సామర్థ్యంతో 52 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో వస్తుంది.