Jio Recharge: యూజర్లకు జియో దీపావళి ఆఫర్.. ఈ రీఛార్జ్‌లతో అదిరిపోయే బెనిఫిట్స్
దీపావళి పండుగ నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థ యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. జియో ట్రూ 5జీ దివాళి ధమాకా పేరుతో యూజర్లకు కళ్లు చెదిరే ఆఫర్ ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ఆఫర్లు.? వాటిని ఎలా రీడిమ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ టెలికాం సంస్థ యూజర్ల సంఖ్యను పెంచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇంటర్నెట్ ఛార్జీలను ఆశాకం నుంచి నేలకు దించిన జియో.. తాజాగా మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన జియో.. తాజాగా దీపాపవళి పండుగను పురస్కరించుకొని కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.
జియో ట్రూ 5జీ దివాళి ధమాకా పేరుతో రెండు రీ ఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 899, రూ. 3599 రిఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనంగా రూ. 3350 విలువైన బెనిఫిట్స్ పొందే అవకాశం కల్పించారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు రూ.
ఈజీమై ట్రిప్‌కు సంబంధించి రూ. 3000 వోచర్ లభించనుంది. ఈ వోచర్‌ను హోటల్స్, ఎయిర్ ట్రావెల్‌కు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా అజియో షాపింగ్‌కు సంబంధించి రూ. 200 కూపన్ పొందొచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 5వతేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రూ. 899తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు 20 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. అదే విధంగా రూ. 3599తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా 365 రోజులతో లభిస్తుంది.
రూ. 999 అంత కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారురూ. 200 డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఫుడ్ డెలివరీకి సంబంధించి రూ. 150 వోచర్ లభిస్తోంది. దీంతో స్విగ్గీలో చేసే ఆర్డర్లపై రూ. 150 డస్కౌంట్ పొందొచ్చు. ఇంతకీ ఈ ఆఫర్లను ఎలా రీడిమ్ చేసుకోవాలనేగా మీ సందేహం. రీఛార్జ్ చేసుకున్న వెంటనే బెనిఫిట్స్ మీ మైజియో అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయి. వీటిని రీడిమ్ చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వండి..
* ముందుగా మైజియోలోని ‘ఆఫర్స్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి.
* అనంతరం మై విన్నింగ్స్‌పై క్లిక్ చేయాలి.
* ఇందులో మీరు ఏ కూపన్‌ను రీడీమ్ చేయాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి.
* కూపన్ కోడ్‌ను కాపీ చేసి మీరు కొనుగోలు చేసే పేమెంట్ గేట్ వే దగ్గర కోడ్‌ను పేస్ట్ చేస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..