Reliance Jio: రిలయన్స్‌ జియో నుంచి చౌకైన ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. వ్యాలిడిటీ, ధర ఎంతంటే..!

రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. తక్కవ ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌పై..

Reliance Jio: రిలయన్స్‌ జియో నుంచి చౌకైన ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. వ్యాలిడిటీ, ధర ఎంతంటే..!
Reliance Jio

Updated on: Dec 10, 2022 | 6:33 AM

రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. తక్కవ ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌పై కంపెనీ ఇప్పుడు మీకు తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు మీరు పేటీఎంలో డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇందులో వినియోగదారులు అపరిమిత కాల్‌లతో పాటు డేటా, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు పేటీఎంలో ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరు కార్డ్ ద్వారా పేటీఎంలో చెల్లిస్తే మీరు 5% క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందవచ్చు.

ఈ ఆఫర్ కింద క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎంలో చెల్లించడం ద్వారా రూ. 33 నుండి 35 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ విషయంలో మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్ వోడాఫోన్, ఎయిర్‌టెల్ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంది. ఎయిల్‌టెల్‌లో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ 77 రోజుల చెల్లుబాటు ఉంటుంది.

జియోను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్‌

ఇది కాకుండా, టెలికాం రంగంలో నిరంతరం ముందంజలో ఉన్న జియో ఇప్పుడు మరోసారి సవాలును ఎదుర్కొంటుంది. రెండవ త్రైమాసికంలో ఆదాయ మార్కెట్ వాటా అంటే ఆర్‌ఎంఎం పరంగా ఎయిర్‌టెల్‌ జియోను వెనుకకు నెట్టింది. ట్రాయ్‌కి సంబంధించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. టెలికాం రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పట్టణ మార్కెట్లలో బలమైన వృద్ధి, డేటా వినియోగం సహాయంతో ఎయిర్‌టెల్‌ ఎయిర్‌టెల్‌ జియోనుని వెనుకకు నెట్టగలిగింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా పతనం కొనసాగుతోంది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ నష్టపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us