Jio Recharge Plan: రోజూ 2GB హై-స్పీడ్ డేటా, 90 రోజుల వ్యాలిడిటీ.. డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం

Jio: టెలికాం సెక్టార్‌లో తన వినియోగదారులకు ఎప్పటి నుంచో గొప్ప ఆఫర్లను అందజేస్తున్న జియో మరో గొప్ప ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. Jio రూ. 949 ప్లాన్ అందుబాటులో ఉంది. ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించకుండా పూర్తి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వినియోగదారుల కోసం ఉపయోగపడనుంది..

Jio Recharge Plan: రోజూ 2GB హై-స్పీడ్ డేటా, 90 రోజుల వ్యాలిడిటీ.. డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం

Updated on: Jan 22, 2025 | 7:57 PM

దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎల్లప్పుడూ గొప్ప ఆఫర్‌లను అందజేస్తుంది. కోట్లాది మంది మొబైల్ వినియోగదారుల జియో చౌక నుండి ప్రీమియం వరకు అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లలో వినియోగదారులు డేటా, కాలింగ్, SMSలతో పాటు అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతారు. భారతదేశంలోని సంపన్న నగరాలలో ఒకటైన ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ముఖ్యమైన బిల్డర్‌గా గుర్తింపు పొందారు. మీరు డిస్నీ + హాట్‌స్టార్ కావాలంటే అదనపు ఛార్జీలు లేకుండా దాని సభ్యత్వాన్ని పొందాలనుకుంటే, Jio మీ కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్‌ను కలిగి ఉంది.

టెలికాం సెక్టార్‌లో తన వినియోగదారులకు ఎప్పటి నుంచో గొప్ప ఆఫర్లను అందజేస్తున్న జియో మరో గొప్ప ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. Jio రూ. 949 ప్లాన్ అందుబాటులో ఉంది. ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించకుండా పూర్తి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వినియోగదారుల కోసం ఉపయోగపడనుంది.

ఈ ప్లాన్‌లో ప్రత్యేకత ఏమిటి?

రిలయన్స్ జియో తన రూ.949 ప్లాన్‌లో కస్టమర్ల కోసం ఎన్నో గొప్ప ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. అలాగే మొత్తం 168 GB డేటా ఇందులో లభిస్తుంది. రోజుకు 2 GB హై-స్పీడ్ డేటా సౌకర్యం అందిస్తోంది. ఆ తర్వాత వేగం 64 Kbpsకి తగ్గుతుంది. ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. తద్వారా వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా కనెక్ట్ అయి ఉంటారు.

అదనపు ప్రయోజనాలు:

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్: ఈ ప్లాన్ 3 నెలల (90 రోజులు) డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది.

JioCinema సబ్‌స్క్రిప్షన్: ఇది కాంప్లిమెంటరీ JioCinema సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. కానీ JioCinema ప్రీమియం సదుపాయాన్ని కలిగి ఉండదు.

అపరిమిత 5G డేటా: ఈ ఫీచర్ అర్హత గల కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి