Jio Plans: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసా..? ప్రయోజనాలు, వాలిడిటీ వివరాలు మీకోసం..

| Edited By: Phani CH

Feb 11, 2022 | 9:22 AM

Jio Recharge Plan 2022: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio) దూసుకెళ్తోంది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో.. డిసెంబర్ 1, 2021 నుంచి

Jio Plans: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసా..? ప్రయోజనాలు, వాలిడిటీ వివరాలు మీకోసం..
Jio Cashback
Follow us on

Jio Recharge Plan 2022: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio) దూసుకెళ్తోంది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో.. డిసెంబర్ 1, 2021 నుంచి ప్రీపెయిడ్ ప్లాన్‌ల రేటును పెంచింది. మరో రెండు ప్రధాన టెలికాం ప్రొవైడర్లు ఏయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ధరను పెంచిన తర్వాత జియో (Jio) టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ మొత్తం ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరను దాదాపు 20 శాతం వరకు సవరించింది. దీంతో ఇప్పుడు జియో కస్టమర్లు.. అంతకుముందు కంటే రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ నెలవారీ/వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా యాడ్ ఆన్ ప్లాన్‌ల ధరలను పెంచింది. కావున మీరు ఏదైనా రీఛార్జ్ చేయడానికి ముందు Jio ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్‌ల కొత్త ధరలను తెలుసుకోవడం మంచిది. ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Jio ఇప్పటికే ఉన్న అన్ని ప్యాక్‌ల రేట్లను అంటే.. 28 రోజుల నుంచి 365 రోజుల చెల్లుబాటుకు సంబంధించిన ధరలను సవరించింది. ఇప్పుడు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలను చూద్దాం.

28 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ. 199 ప్లాన్ రీఛార్జ్ ఇప్పుడు రూ. 239 అవుతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. గతంలో 28 రోజుల పాటు 2GB రోజువారీ డేటాను అందించే ప్లాన్ ధర రూ. 299 అయింది.

56 రోజుల వ్యాలిడిటీతో రూ.399 ఉన్న ప్లాన్ రేటు రూ. 479కి పెరిగింది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 1.5GB డేటాతో వస్తుంది. అదేవిధంగా 2GB డేటా రోజువారి ప్యాక్ 56 రోజుల వ్యాలిసిటీ ఉన్న ధర ఇప్పుడు రూ.444 నుంచి రూ.533 కి పెరిగింది.

84 రోజుల రూ.329 ప్లాన్ ధర రూ.395కి పెంచబడింది. ఈ ప్యాక్‌లో 6GB డేటా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ.555 ప్యాక్, రోజుకు 1.5జీబీ డేటాతో ఉన్న ప్లాన్ రూ.666కి పెంచారు. దీని వాలిడిటీ 84 రోజులు. 2GB/రోజు ప్యాక్ ఇప్పుడు రూ. 599 నుంచి రూ.719కి పెరిగింది.

1,299 రూపాయల 336 రోజుల ప్యాక్ రేటు 1,559 రూపాయలకు పెరిగింది. రోజుకు 2GB డేటాతో ఉన్న వార్షిక రీఛార్జ్ ప్లాన్ రూ.2,399 నుంచి రూ.2,879కి పెరిగింది.

టెలికాం ఆపరేటర్ టాప్ అప్ ప్యాక్ ధరను కూడా సవరించింది. రూ.51 యాడ్ ఆన్ ప్లాన్ ధర రూ.61కి, రూ.101 ప్యాక్ ధర రూ.121కి, రూ.251 నుంచి రూ.301కి ఇలా 6జీబీ, 12జీబీ, 50జీబీ డేటాకు సంబంధించిన ప్యాక్‌లన్నీ పెరిగాయి.

Also Read:

Customer Charges Hike: వినియోగదారులకు అలర్ట్.. కార్డు వినియోగ ఛార్జీలు పెంచిన బ్యాంకిగ్ దిగ్గజం

Anand Mahindra: ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్.. వాటిని అలా చేయాల్సిందంటూ సూచన..