5G: టెలికాం యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో మరో 850 ప్రాంతాల్లో 5జీ సేవలు.

|

Jun 06, 2023 | 7:50 AM

టెలికాం రంగంలో సంచలనంలా దూసుకొచ్చిన జియో తన సేవలను విస్తరిస్తూ పోతోంది. ముఖ్యంగా 5జీ సేవల రంగంలో ఇతర సంస్థల కంటే వేగంగా తమ నెట్‌వర్క్‌ని విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో తాజాగా మరికొన్ని పట్టణాల్లో సేవలను విస్తరించింది...

5G: టెలికాం యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో మరో 850 ప్రాంతాల్లో 5జీ సేవలు.
5g Services
Follow us on

టెలికాం రంగంలో సంచలనంలా దూసుకొచ్చిన జియో తన సేవలను విస్తరిస్తూ పోతోంది. ముఖ్యంగా 5జీ సేవల రంగంలో ఇతర సంస్థల కంటే వేగంగా తమ నెట్‌వర్క్‌ని విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో తాజాగా మరికొన్ని పట్టణాల్లో సేవలను విస్తరించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలతో సహా మొత్తం 850కిపై ప్రాంతాల్లో జియో కొత్తగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే జియో ప్రస్తుతం జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 1 జీబీపీఎస్‌+ వరకు డేటాను ఉచితంగా అందిస్తున్నారు. 5జీ సేవల విస్తరణపై జియో తెలంగాణ సీఈఓ శ్రీకెసిరెడ్డి మాట్లాడుతూ..’తెలంగాణలో కొత్తగా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను విస్తరించడం పట్ట సంతోషంగా ఉంది. తెలంగాణలోని యూజర్ల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ జియో సేవలను విస్తరించింది. తెలంగాణలో ఇన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించిన తొలి టెలికాం సంస్థగా జియో రికార్డు సృష్టించింది. 2023 డిసెంబర్‌ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ పట్టణం, తాలూకాలో 5జీ సేవలను తీసుకొచ్చే లక్ష్యంగా 5జీ కృషి చేస్తోంది.

జియో 4జీ నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా స్వతంత్ర 5జీ ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుంది. అంతేకాకుండా జియో 700 mhz, 3500 mhz, 26 Ghz బ్యాండ్‌లతో 5జీ స్ట్రెక్టమ్‌ను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..