Jio 5G Network: దేశంలోని 1000 ప్రధాన నగరాల్లో జియో 5జీ.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జియో..

|

Jan 23, 2022 | 10:33 AM

దేశంలో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా టెలికం దిగ్గజం రియన్స్ జియో చర్యలు చేపట్టింది...

Jio 5G Network: దేశంలోని 1000 ప్రధాన నగరాల్లో జియో 5జీ.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జియో..
Jio Cashback
Follow us on

దేశంలో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా టెలికం దిగ్గజం రియన్స్ జియో చర్యలు చేపట్టింది. దేశంలోని 1000 ప్రధాన నగరాల్లో పైలట్​ ప్రాజెక్టు కింద 5G నెట్‌వర్క్‌ను అందించేందుకు ప్రణాళికలు రచిస్తుంది.

ఈ మేరకు రిలయన్స్‌ జియో ప్రకటన విడుదల చేసింది. ఎంపిక చేసిన నగరాల్లో ఫైబర్‌ సామర్థ్యాన్ని పెంచడమే గాక పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశంలో 5G విస్తరణ కోసం ప్రత్యేక బృందాలను తయారు చేసినట్లు జియో ప్రతినిధి ఒకరు వెల్లడిచారు.

5జీ నెట్‌వర్క్‌ ప్రత్యేకమైనదని.. అందుకోసం 3D మ్యాప్‌ వంటి అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నట్లు ఆయిన తెలిపారు. ఆరోగ్యం, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగాల్లో 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లు జియో పేర్కొంది. అనుమతులు రాగానే నెట్‌వర్క్ విస్తరణ పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపింది.

Read Also.. Credit Card: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..