Pensioners Alert: పెన్షనర్లకు అలర్ట్‌.. నవంబర్‌ 30 వరకు గడువు.. లేకపోతే పెన్షన్‌ రాదు

మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ అయితే మీకో అలర్ట్‌. పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ చాలా ముఖ్యమైన పత్రం. ప్రభుత్వం నుంచి పింఛను పొందుతున్న వ్యక్తులు ఏటా జీవిత ధ్రువీకరణ పత్రాన్ని..

Pensioners Alert: పెన్షనర్లకు అలర్ట్‌.. నవంబర్‌ 30 వరకు గడువు.. లేకపోతే పెన్షన్‌ రాదు
Pensioners
Follow us

|

Updated on: Nov 27, 2022 | 3:29 PM

మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ అయితే మీకో అలర్ట్‌. పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ చాలా ముఖ్యమైన పత్రం. ప్రభుత్వం నుంచి పింఛను పొందుతున్న వ్యక్తులు ఏటా జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే పెన్షన్‌ వస్తుంది. పెన్షనర్లు ఈ సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే 30 నవంబర్ 2022లోపు సమర్పించాలి. దీని కోసం పెన్షనర్లు బ్యాంకు శాఖకు వెళ్లి తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. తద్వారా అతని పెన్షన్ కొనసాగుతుంటుంది. ఎటువంటి సమస్య ఉండదు. వారు ఈ పనిని నవంబర్ 30 వరకు మాత్రమే చేయాలి.

ప్రతి సంవత్సరం సర్టిఫికేట్‌ సమర్పించాలి:

పెన్షనర్లు తమ పెన్షన్‌ను కొనసాగించడానికి వారి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని 30 నవంబర్ 2022లోపు సమర్పించాలి. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 1కి బదులుగా అక్టోబర్ 1 నుండి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది.

ఈ విధంగా సర్టిఫికేట్‌ను సమర్పించండి:

☛ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని ఈ మార్గాల్లో సమర్పించవచ్చు. ప్రభుత్వ పింఛనుదారులు తమ పెన్షన్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా పొందేందుకు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం ద్వారా పింఛను పొందుతున్న వ్యక్తి బతికే ఉన్నాడా లేదా అనేది తెలుస్తుంది. ఈ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి మీరు అనేక పద్ధతులను అనుసరించవచ్చు.

ఇవి కూడా చదవండి

☛ లైఫ్ సర్టిఫికేట్ కూడా ఆన్‌లైన్‌లో రూపొందించవచ్చు. మీరు కేంద్ర ప్రభుత్వ లైఫ్ సర్టిఫికేట్ పోర్టల్ https://jeevanpramaan.gov.in/ నుండి డిజిటల్‌గా లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించవచ్చు. ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా డిజిటల్ సర్టిఫికేట్‌ను రూపొందించవచ్చు.

 డోర్ స్టెప్ సర్వీస్ ద్వారా పెన్షనర్లు 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అలయన్స్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ డోర్‌స్టెప్ సర్వీస్‌ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించవచ్చని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ తెలిపింది.

☛ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అలయన్స్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇండియన్ బ్యాంక్ మొదలైనవి.

☛ మీరు వెబ్‌సైట్ (doorstepbanks.com లేదా www.dsb.imfast.co.in/doorstep/login) లేదా డోర్‌స్టెప్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లేదా టోల్ ఫ్రీ నంబర్ (18001213721 లేదా 18001037188)కి కాల్ చేయడం ద్వారా బ్యాంక్ డోర్‌స్టెప్ సేవను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల మీరు ఇంట్లో సౌలభ్యం పొందుతారు. మీరు లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా సమర్పించలేకపోతే, మీ పెన్షన్ వచ్చే బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి సమర్పించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి