Jawa 42 FJ 350: స్టైలిష్ లుక్‌లో కొత్త జావా బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి గట్టి పోటీ తప్పదు..

|

Sep 04, 2024 | 4:22 PM

ఈ క్రమంలో దానికి పోటీగా జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ రంగంలోకి దిగింది. తన కొత్త ఉత్పత్తి జావా 42ఎఫ్‌జే మోటార్ సైకిల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99లక్షలుగా ఉంది. ఇది సరికొత్త స్టైలింగ్ తో పాటు, పెద్ద ఇంజిన్ వస్తుంది. దీని బుకింగ్స్ ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ రెండో తేదీ నుంచి మొదలవనున్నాయి.

Jawa 42 FJ 350: స్టైలిష్ లుక్‌లో కొత్త జావా బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి గట్టి పోటీ తప్పదు..
Jawa 42 Fj 350
Follow us on

మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే దీనికి సరైన ప్రత్యామ్నాయం ఇప్పటి వరకూ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఆ సెగ్మెంట్లో ఎన్‌ఫీల్డ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ క్రమంలో దానికి పోటీగా జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ రంగంలోకి దిగింది. తన కొత్త ఉత్పత్తి జావా 42ఎఫ్‌జే మోటార్ సైకిల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99లక్షలుగా ఉంది. ఇది సరికొత్త స్టైలింగ్ తో పాటు, పెద్ద ఇంజిన్ వస్తుంది. దీని బుకింగ్స్ ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ రెండో తేదీ నుంచి మొదలవనున్నాయి. ఇప్పటికే ఉన్న జావా 42కి అప్ డేటెడ్ వెర్షన్ గా ఇది వస్తోంది. భారత మార్కెట్లో ఇది నేరుగా రాయల్ ఎన్‌ఫిల్డ్ హంట్ 350, హోండా సీబీ 350 వంటి మోడళ్లతో పోటీపడనుంది.

జావా 42ఎఫ్‌జే లుక్..

సరికొత్త జావా 42ఎఫ్‌జే లుక్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఈ మోటార్ సైకిల్ ఆధునిక రెట్రో థీమ్‌ను పొందుతుంది. దీనికి టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, పక్కన అల్యూమినియం ప్లేట్ ఉంటుంది. బండి ట్యాంక్ పై పెద్ద అక్షరాలలో జావా అని ఉంటుంది. సైడ్ ప్యానల్స్ పాత స్టాండర్డ్ వెర్షన్ లాగానే ఉంటాయి. అయితే సీటు డిజైన్ కొత్తగా ఉంది. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా విభిన్నంగా ఇచ్చారు. దీని ద్వారా రైడర్ కు అదనపు సౌలభ్యం కలుగుతుంది. అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి.

జావా 42ఎఫ్‌జే ఫీచర్లు..

ఇక ఫీచర్ల గురించి చూస్తే ముందు వైపు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్, అసిస్ట్, స్లిప్పర్ క్లట్చ్ వంటివి ఉంటాయి.

జావా 42ఎఫ్‌జే స్పెసిఫికేషన్లు..

ఈ సరికొత్త బైక్లో 334సీసీ సింగిల్ సిలెండర్, లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది. ఈ కొత్త ఇంజిన్ అధిక ఎన్వీహెచ్ లెవెల్స్, పనితీరును కలిగి ఉంటుంది. పాత మోడల్ తో పోల్చితే మరింత సమర్థనీయమైన థర్మల్ మేనేజ్మెంట్ యూనిట్ ఉంటుంది. ఇది 22బీహెచ్పీ, 28ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఇతర మెకానిక్ భాగాల గురించి చెప్పాలంటే ముందు వైపు టెలీస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జర్బర్లు ఉంటాయి. డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. డ్యూయల్ చానల్ ఏబీఎస్ తో వస్తుంది.

జావా 42ఎఫ్‌జే లాంచ్ సందర్భంగా జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా మాట్లాడుతూ 2024లో ఈ జావా42 ఎఫ్జే తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తమమైన డిజైన్ తీసుకురావడానికి సమయం పట్టినట్లు చెప్పారు. ధర తగిన పనితీరును ఈ బైక్ అందిస్తుందని వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..