iVoomi S1 Lite: మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ.. తక్కువ ధరకే మతిపోయే ఫీచర్స్‌

|

Jun 26, 2024 | 4:00 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇవూమీ తన సరికొత్త స్కూటర్ను ఎస్‌ 1 లైట్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి తాజా స్కూటర్‌ మల్టీలేయర్‌ సెక్యూరిటీ సిస్టమ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సేఫ్టీ మెకానిజమ్‌ అయిన రిమూవబుల్‌బ్యాటరీ ఈ స్కూటర్‌ ప్రత్యేకత. అలాగే ఈ బ్యాటరీ పై కంపెనీ మూడేళ్ల వారెంటీ అందిస్తుంది.

iVoomi S1 Lite: మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ.. తక్కువ ధరకే మతిపోయే ఫీచర్స్‌
Ivoomi S1 Lite
Follow us on

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇవూమీ తన సరికొత్త స్కూటర్ను ఎస్‌ 1 లైట్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి తాజా స్కూటర్‌ మల్టీలేయర్‌ సెక్యూరిటీ సిస్టమ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సేఫ్టీ మెకానిజమ్‌ అయిన రిమూవబుల్‌బ్యాటరీ ఈ స్కూటర్‌ ప్రత్యేకత. అలాగే ఈ బ్యాటరీ పై కంపెనీ మూడేళ్ల వారెంటీ అందిస్తుంది. ముఖ్యంగా ఇవూమీ ఎస్‌ 1 లైట్‌ స్కూటర్‌ అధిక నిల్వ స్థలంతో వస్తుందని ఈ ఫీచర్‌ భారతీయ మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉంటుందని ఇవూమీ ప్రతినిధులు చెబతున్నారు. ఇవూమీ ఎస్‌ 1 లైట్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఇవూమీ ఎస్‌ 1 లైట్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. ఇందులో గ్రాఫేన్-అయాన్ బ్యాటరీతో వచ్చే స్కూటర్‌ ధర రూ. 54,999, లిథియం-అయాన్ బ్యాటరీ రూ. 64,999గా ఉంటుంది. గ్రాఫేన్ అయాన్ బ్యాటరీతో కూడిన ఈవీ వెర్షన్ 75 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో లిథియం అయాన్ బ్యాటరీతో ఉన్న బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇవూమీ ఎస్‌1 స్కూటర్‌ ఎస్‌1 మాదిరిగానే ఆధునిక కోణీయ డిజైన్తో వస్తుంది. ఈ స్కూటర్‌ ఆప్రాన్‌లో అతి పెద్ద హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఈ హెడ్‌ ల్యాంప్స్‌పై అధునాతన డీఆర్‌ఎల్‌ ఆకర్షిస్తుంది. ఈ కేటగిరీకి చెందిన చాలా వాహనాల మాదిరిగానే ఇది పొడవైన సింగిల్ పీస్ సీటుతో వస్తుంది. ఈ స్కూటర్‌ పెర్ల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడైనైట్ బ్లూ, ట్రూ రెడ్, పికాక్‌ బ్లూ వంటి ఆరు రంగు ఎంపికలతో ఆకర్షిస్తుంది. 

ఇవూమీ ఎస్‌ 1 లైట్‌ 18 లీటర్ల బూట్ స్పేస్, 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ అందించేలా డిజైన్ చేశారు. కాబట్టి ఈ స్కూటర్‌ విభిన్న భూభాగాలతో పాటు రైడర్ ప్రాధాన్యతలను తీర్చడానికి 12 అంగుళాల, 10-అంగుళాల చక్రాలతో వస్తుంది. ఇవూమీ ఎస్‌ 1 లైట్‌ ఫీచర్ లిస్ట్‌లో ఎల్‌ఈడీ స్పీడోమీటర్ డిస్ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు సెవెన్‌ స్టేజ్‌ భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన గ్రాఫేన్ వేరియంట్ డ్రైన్ అయినప్పుడు గరిష్టంగా 45 కేఎంపీహెచ్‌ వేగాన్ని అందుకోగలదు; ఇది 3 గంటల్లో 60వీ ఛార్జర్‌ను ఉపయోగించి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇవూమీ ఎస్‌ 1 లైట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన లిథియం అయాన్ వెర్షన్ గరిష్టంగా 55 కేఎంపీహెచ్‌ వేగంతో 1.5 గంటల్లో 50 శాతం, 3 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..