ITR Filing: 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు (ITR Filing)చేయడానికి చివరి తేదీ మార్చి31, 2022. అయితే 2021 డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పెంచింది ఆదాయపు పన్ను (Income Tax) శాఖ. గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. గడువు తర్వాత ఐటీఆర్ (ITR) దాఖలు చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జరిమానా (Penalty) లేదా కనీసం మూడు సంవత్సరాల పాటు జైలు (Jail) శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆదాయపు పన్ను నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్నుకు సంబంధించిన ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేయడంలో విఫలమైనట్లయితే వడ్డీతో పాటు ఆదాయపు పన్ను శాఖ 50 శాతం నుంచి 200 శాతం వకు జరిమానా విధించవచ్చని అన్నారు. డిపార్ట్‌మెంట్ నుండి ఆదాయపు పన్ను నోటీసుకు ప్రతిస్పందనగా పన్నుచెల్లింపుదారుడు తన ITRని దాఖలు చేసే తేదీ వరకు బాధ్యత వహిస్తాడు. చివరి తేదీలోగా ITR ఫైల్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయన్నారు. ఆదాయపు పన్ను నిబంధనలను ఆయన వివరించారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేయడంలో విఫలమైతే కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
గడువు తేదీ తర్వాత కానీ చివరి తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆలస్య రుసుము గురించి మాట్లాడారు. పన్ను చెల్లింపుదారు 31 డిసెంబరు 2021 వరకు గడువు విధించగా, తర్వాత ఆ గడువును పెంచింది. ITR చివరి తేదీ 2022 మార్చి 31 నాటికి తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. పన్ను చెల్లింపుదారు తన వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ITR ఫైల్ చేసే సమయంలో రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. ఒకవేళ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆలస్య రుసుము తగ్గుతుంది. కేవలం రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి: