ITR Filing Last Date: చివరి రోజు ITR ఫైలింగ్ చేద్దామని అనుకుంటున్నారా.. ఆ రోజు ఆదివారం అని గుర్తుందా..

|

Jul 26, 2022 | 12:34 PM

ITR Filing: ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ రోజు బ్యాంకు సెలవుదినం. కాబట్టి, మీరు గడువు తేదీ జూలై 31 లోపు ITR నింపడం మంచిది.

ITR Filing Last Date: చివరి రోజు ITR ఫైలింగ్ చేద్దామని అనుకుంటున్నారా.. ఆ రోజు ఆదివారం అని గుర్తుందా..
Itr Filing
Follow us on

ఈ సంవత్సరం ITR (ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీ) ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈ సంవత్సరం ITR ఫైల్ చేయడానికి గడువు ఆదివారంతో ముగియనుంది. మీరు ఫైలింగ్ చేయకుంటే వెంటనే ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం మంచిది. ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఐటీఆర్‌ను ఫైల్ చేయవచ్చు. ఆదివారం ప్రభుత్వ సెలవుదినం. అలా అని ఇది ITR ఫైలింగ్‌పై ప్రభావం చూపదు. అయితే ఆదివారం సమస్య ఉండవచ్చు.. ఎందుకంటే ఆ  రోజు నెట్‌బ్యాంకింగ్ చాలా అరుదుగా పని చేస్తుంది. లేదా ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉంటుంది. చివరి రోజు కారణంగా కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. ఈ ప్రభావం మన ఐటీఆర్ ఫైలింగ్‌పై ఉండే అవకాశం ఉంది.

TDS సర్టిఫికేట్ 

మీరు ఆదాయపు పన్నును పూరించవలసి వస్తే, అది ITNS 280 వంటి చలాన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేకపోతే.. మీరు చెల్లింపు కోసం సంబంధిత శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ఫారం 16A అంటే TDS సర్టిఫికేట్ పొందడానికి మీరు బ్యాంకుకు వెళ్లాలి. మీరు ఆన్‌లైన్‌లో పొందలేకపోయినా.. మీరు బ్యాంకు శాఖకు వెళ్లవలసి ఉంటుంది. అయితే జులై 31 ఆదివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.

అపరాధ రుసుము రూ. 1,000 నుండి 5,000 వరకు 

మీరు నిర్ణీత సమయం తర్వాత అంటే జూలై 31, 2022 తర్వాత, డిసెంబర్ 31, 2022లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినట్లయితే.. అప్పుడు రూ. 5,000 అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే..  అప్పుడు రూ. 1,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..