Home loans: సొంతిల్లు సమకూర్చుకోవడం ఇప్పుడు చాలా సులభం.. ఆ బ్యాంకుల్లో హోమ్‌లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు

సొంతింటిని సమకూర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాధాన్యమిస్తారు. తాము సంపాదించే ఆదాయాన్ని పొదుపు చేసుకుంటూ ఆ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సొంతిల్లు అనేది సమాజంలో గుర్తింపునివ్వడంతో పాటు జీవితం ప్రశాంతంగా సాగేందుకు ఉపయోగపడుతుంది. అందరూ చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళుతున్నారు. అక్కడ స్థిరపడిన తర్వాత సొంతిల్లు కట్టుకోవడానికి ప్రణాళిక వేసుకుంటారు. నిర్ణీత ఆదాయం ఉన్న వారందరికీ నిబంధనల ప్రకారం బ్యాంకులు హోమ్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. ఇల్లు సమకూర్చుకోవాలనుకునే వారికి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి.

Home loans: సొంతిల్లు సమకూర్చుకోవడం ఇప్పుడు చాలా సులభం.. ఆ బ్యాంకుల్లో హోమ్‌లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు
Home Loan
Follow us
Srinu

|

Updated on: Nov 04, 2024 | 7:54 PM

ప్రభుత్వం, ప్రైవేటురంగ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు హోమ్ లోన్లు అందజేస్తాయి. వాటిపై నిర్ణీత వడ్డీ విధిస్తాయి. ప్రతి నెలా ఈఎంఐల రూపంలో సులభంగా చెల్లించే వీలుంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు పట్టణాల్లో అపార్టుమెంట్లు, ఇళ్లు కట్టి అమ్మకాలు జరుపుతూ ఉంటాయి. వీటికి బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలను తీసుకోవచ్చు. అయితే మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే రుణం తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. రుణం ఇచ్చే మొత్తం, వాటిపై వసూలు చేసే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వం రంగ బ్యాంకులు

ప్రభుత్వ రంగ బ్యాంకులు హోమ్ లోన్లను విరివిగా మంజూరు చేస్తున్నాయి. వాటి వడ్డీరేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి. బ్యాంకు ఆఫ్ ఇండియాలో 8.35 నుంచి 10.85 వరకూ, యూనియన్ బ్యాంకులో 8.35 నుంచి 10.90 వరకూ, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8.40 నుంచి 10.90 శాతం వరకూ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 8.45 నుంచి 10.25, ఇండియన్ బ్యాంకులో 8.40 నుంచి 10.30, కెనరా బ్యాంకులో 8.40 నుంచి 11.25, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 8.50 నుంచి 9.85, యుకో బ్యాంకులో 8.45 నుంచి 10.30 శాతం వసూలు చేస్తున్నారు.

ప్రైవేటు బ్యాంకులు

హోమ్ లోన్లపై ప్రైవేటు బ్యాంకులు వసూలు చేసే వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి. సిటీ యూనియన్ బ్యాంకులో 8.45 నుంచి 10.70, హెచ్ ఎస్ బీసీ బ్యాంకులో 8.50 నుంచి, కర్ణాటక బ్యాంకులో 8.50 నుంచి 10.62, సౌత్ ఇండియన్ బ్యాంకులో 8.70 నుంచి 11.70, యాక్సిస్ బ్యాంకులో 8.75 నుంచి 13.30, కోటక్ మహీంద్రాలో 8.75 నుంచి 13.30, కరూర్ వైశ్యా బ్యాంకులో 9 నుంచి 11.05 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఆర్బీఎల్ బ్యాంకులో 8.90 నుంచి, ఫెడరల్ బ్యాంకులో 8.80 నుంచి ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ, హెడ్డీఎఫ్ సీ బ్యాంకుల్లో 8.75 నుంచి మొదలవుతాయి.

ఇవి కూడా చదవండి

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు

బ్యాంకులతో పాటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా హోమ్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. వాటిలో వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లో 8.50 నుంచి 10.75, పీఎన్ బీ లో 8.50 నుంచి 14.50, ఎస్ఎంఎఫ్జీ ఇండియాలో 9.30 నుంచి 10 శాతం వరకూ వసూలు చేస్తున్నారు. బజాజ్ కంపెనీలో 8.50 నుంచి, గోద్రేజ్ కంపెనీలో 8.55 నుంచి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో 8.60 నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి