Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..

|

Apr 20, 2022 | 2:14 PM

ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కార్మిక మంత్రిత్వ శాఖలో తాజాగా ఫిర్యాదు నమోదైంది. టాప్-5 భారతీయ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు..

Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..
Infosys
Follow us on

IT employees union complaint on Infosys: ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కార్మిక మంత్రిత్వ శాఖలో తాజాగా ఫిర్యాదు నమోదైంది. టాప్-5 భారతీయ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు ఇన్ఫోసిస్‌ (Infosys)తో సమానమైన టీసీఎస్‌, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో లాంటి పేరున్న కంపెనీల్లో పనిచేయకూడదని ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ కొత్త నిబంధనను తెచ్చింది. రాజీనామా చేసిన ఉద్యోగులకే కాకుండా కొత్తగా ఇన్ఫోసిస్‌లో జాయిన్‌ అయ్యే ఉద్యోగుల ఆఫర్‌ లెటర్‌లో కూడా ఈ నిబంధనను జోడించింది. దీంతో ఆందోళనకు గురైన ఐటీ ఉద్యోగుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఇన్ఫోసిస్‌ నిర్ణయంపై కార్మిక మంత్రిత్వశాఖకు ప్రముఖ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇన్ఫోసిస్‌ తెచ్చిన క్రూర నిబంధనపై సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది.

నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజా ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులో ఇన్ఫోసిస్‌ తెచ్చిన నిబంధన కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల హక్కులను నైతికంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. భారత ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్‌ రేటు గణనీయంగా పెరిగింది. ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్‌ రేటు భారీగా ఉంది. గత 3 నెలల్లో 80,000 మందికి పైగా ఉద్యోగులు ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇక కంపెనీ అట్రిషన్‌ రేటు గణనీయంగా 27శాతంకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ నుంచి ఉద్యోగుల వలసలను ఆపేందుకు గాను కంపెనీ ఈ కఠిన నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత్‌లోని అన్నీ ఐటీ కంపెనీల్లో అట్రిషన్‌ రేటు ఇదే స్థాయిలో ఉండడం గమనార్హం.

కాగా ఐటీ Q4 ఆదాయాల నేపథ్యంలో ఈ నిబంధన తెచ్చింది. మార్చి 31 త్రైమాసికం ముగింపునాటికి ఇన్ఫోసిస్‌ కంపెనీలో దాదాపు 85,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకుంది. మరోవైపు ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అట్రిషన్ రేటు 27.7 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గత 12 నెలలుగా ఐటీ కంపెనీల్లో పనిచేసిన ఉద్యోగులు మరి ఏ ఇతర కంపెనీల్లో పనిచేయకుండా ఇన్ఫోసిస్‌ ఈ కఠిన నిబంధనను విధించింది. దీని ప్రకారం ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగిన ఉద్యోగులు ఆరు నెలల పాటు సరిసమానమైన కంపెనీల్లో ఉద్యోగాలు చేయకూడదనే నిబంధన తెరపైకి తెచ్చింది. ఈ నిబంధన అమలు చేయకుండా ఇన్ఫోసిస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

Also Read:

SAMEER Recruitment 2022: నెలకు రూ.30,000లజీతంతో సమీర్‌లో రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..