Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ తప్పు అస్సలు చేయకండి.. అలా చేస్తే తులానికి రూ.6 వేలు నష్టపోయినట్లే..

బంగారం ధర తులం ఏకంగా రూ. 60 వేల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, ఆభరణాల స్వచ్ఛతపై మనం సీరియస్‎గా ఉండాలి. లేకపోతే ఒక్క గ్రాములో తేడా వచ్చినా దాదాపు రూ. 6 వేల వరకూ మనం నష్టపోయే ప్రమాదం ఉంది

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ తప్పు అస్సలు చేయకండి.. అలా చేస్తే తులానికి రూ.6 వేలు నష్టపోయినట్లే..
Gold Price

Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 12, 2023 | 9:40 AM

బంగారం ధర తులం ఏకంగా రూ. 60 వేల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, ఆభరణాల స్వచ్ఛతపై మనం సీరియస్‎గా ఉండాలి. లేకపోతే ఒక్క గ్రాములో తేడా వచ్చినా దాదాపు రూ. 6 వేల వరకూ మనం నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది. అయినప్పటికీ కొన్ని మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారాన్ని గుర్తించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బంగారం కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి? మీ బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకోవడం ఎలా? వంటి విషయాలపై దృష్టి సారించాలి.

హాల్‌మార్కింగ్ స్కీమ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం నిజమైన బంగారం 24 క్యారెట్ మాత్రమే, కానీ ఈ క్వాలిటీతో ఆభరణాలు తయారు చేయరు, ఎందుకంటే ఇది చాలా మృదువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల కోసం ఉపయోగిస్తారు, ఇందులో 91.66 శాతం బంగారం ఉంటుంది. హాల్‌మార్క్‌లో రకాల క్వాలిటీ ప్రమాణాలు ఉన్నాయి. ఒక్కో క్యారెట్‌కి ఒక్కో హాల్‌మార్క్ ఉంటుంది. ఉదాహరణకు, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.

హాల్‌మార్క్‌ని గుర్తించడం ఇలా :

ఇవి కూడా చదవండి

BIS హాల్‌మార్క్ అనేది బంగారం-వెండి స్వచ్ఛత ధృవీకరణకు సంబంధించినది. హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క త్రిభుజాకార గుర్తును కలిగి ఉంటుంది. హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోతో పాటు బంగారం స్వచ్ఛత కూడా రాసి ఉంటుంది. ఆభరణం తయారీ సంవత్సరం తయారీదారు లోగోను కూడా కలిగి ఉంటుంది.

ఈ తప్పులు చేయకండి..:

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, ముందుగా దాని స్వచ్ఛతను తెలుసుకోండి. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది. బంగారు ఆభరణాలను 22 లేదా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఆభరణాలను కొనుగోలు చేసే ముందు జువెలరీ షాపులో బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయండి.

స్వచ్ఛత ధృవీకరణ పత్రం తీసుకోవడం మర్చిపోవద్దు:

బంగారం కొనుగోలు చేసేటప్పుడు ప్రామాణికత/స్వచ్ఛత ధృవీకరణ పత్రాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. సర్టిఫికెట్‌లో క్యారెట్ బంగారం నాణ్యతను కూడా తనిఖీ చేయండి. అలాగే, బంగారు ఆభరణాలలో ఉపయోగించే రత్నాలకు ప్రత్యేక సర్టిఫికేట్ తీసుకోండి.

విశ్వసనీయ దుకాణాల నుండి కొనుగోలు చేయండి :

ఎల్లప్పుడూ విశ్వసనీయ దుకాణాల నుండి బంగారు నగలను కొనండి. ఎల్లప్పుడూ హాల్‌మార్క్ గుర్తుతో ఆభరణాలను కొనుగోలు చేయండి.

ధర తెలుసుకొని షాపుకు వెళ్లండి:

మార్కెట్‌లో బంగారం ధర తెలియకుండానే చాలాసార్లు వినియోగదారులు షాపింగ్‌కు వెళ్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయకండి. దీని కారణంగా, మీ డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీరు సరైన విలువను పొందలేరు.

బిల్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలి:

బంగారు నగలను కొనుగోలు చేసిన తర్వాత బిల్లు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నగలను ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తున్నాము అంతే జాగ్రత్తగా బంగారం కొనుగోలు చేసిన బిల్లులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా మోసం జరిగితే మీ వద్ద బిల్లు ఉండటం తప్పనిసరి. అలాగే పరుగు మజూరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే తరుగు పేరిట ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి