నగదు రహిత బీమా పాలసీ ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా మారింది. ఇది ఆసుపత్రి బిల్లులు, చికిత్స ఖర్చుల చెల్లింపుపై ఒత్తిడి లేకుండా ఆరోగ్య సంరక్షణ అవసరాలను తక్షణమే పొందేలా చేస్తుంది. దీంతో దేశంలోని మెజారిటీ బీమా కంపెనీలు నగదు రహిత మెడిక్లెయిమ్ పాలసీలపై క్లెయిమ్ చేసేలా పెద్ద సంఖ్యలో ప్రయోజనాలను అందించడం ప్రారంభించాయి. నగదు రహిత ఆరోగ్య బీమా కింద కవర్ చేసిన వారి మెడికల్ బిల్లులు నేరుగా బీమా ప్రొవైడర్ ద్వారా పరిష్కారమవుతాయి. మొత్తం వైద్య ఖర్చులు సమ్ అష్యూర్డ్ కవరేజీని మించకూడదు. చికిత్స అందించే ఆసుపత్రి నెట్‌వర్క్ లేదా పథకంలో భాగంగా ఉండాలి. నగదు రహిత ఆరోగ్య బీమా పాలసీల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో షరత్తులు అనేవి కీలకపాత్ర పోషిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో నగదు రహిత క్లెయిమ్‌లు పని చేయని కొన్ని షరతులు ఉన్నాయి. నగదు రహితం, ఇది సౌలభ్యం కోసం మాత్రమే అయినప్పటికీ, అత్యవసర సందర్భాల్లోసహాయం చేయదని గమనించాలి. సరళంగా చెప్పాలంటే ఇది అత్యవసర సేవ కాదు. సమయం కొరత కారణంగా నగదు రహిత ప్రక్రియ తరచుగా అవసరమైన సందర్భంలో పనిచేయకపోవచ్చు. నగదు రహితం వెంటనే పని చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
బీమా సంస్థలు తమ మొదటి ఆమోదం ఇవ్వడానికి దాదాపు ఆరు నుండి ఇరవై నాలుగు గంటల సమయం తీసుకుంటాయి. దీనిని ప్రీ-ఆథరైజేషన్ అంటారు. ఎందుకంటే ఆమోదానికి ముందు, అందించాల్సిన చికిత్స కవర్ చేయబడిందా? లేదా? అని తనిఖీ చేయడానికి వారు మీ పాలసీ కవరేజీని మాన్యువల్‌గా మూల్యాంకనం చేస్తారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు ఇంత కాలం వేచి ఉండలేరు. కాబట్టి నగదు రహిత సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ మీరే ముందస్తు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
ఆసుపత్రిలో బీమా డెస్క్ 24X7 తెరిచి ఉండకపోవచ్చు. అవి సాధారణంగా 12 గంటలు తెరిచి ఉంటాయి. అలాగే సెలవు దినాల్లో కూడా మూసేస్తారు. ఆసుపత్రి డెస్క్ మూసి ఉన్న సమయంలో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే తదుపరి పని గంట వరకు నగదు రహిత క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ఎవరూ ఉండరు. అటువంటి పరిస్థితులలో మీరు రోగికి సంబంధించిన చికిత్సను ప్రారంభించడానికి ముందస్తు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అత్యవసర నిధి, యాక్టివ్ క్రెడిట్ కార్డ్‌ని నిర్వహించడం చాలా ముఖ్యం. అవసరమైన సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి