జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్ స్టోరేజీని వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించనుంది జియో. దీంతో గూగుల్, యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో గూగుల్ వన్, యాపిల్ ఐక్లౌడ్ సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లలో అధిక మంది గూగుల్ ఉచితంగా అందిస్తున్న 15జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు. దీంతో వారు అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం గూగుల్ వన్ 100జీబీ స్టోరేజీ ధర నెలకు రూ.130 ఉండగా.. ఐ క్లౌడ్ 50జీబీ స్టోరేజీ ధర రూ.75గా ఛార్జ్ వసూలు చేస్తోంది.
రిలయన్స్ కీలక నిర్ణయాలు..
ఏజీఎం సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ. జియో యూజర్లకు 100జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇవ్వడంతో పాటు.. ‘హలో జియో’ పేరుతో సెటప్ బాక్స్ కోసం టీవీ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇకపై జియో ఫైబర్ రిమోట్‌లో AI బటన్‌తో కొత్త ఫీచర్ ఉంటుందన్నారు. రిలయన్స్ షేర్స్ ఉన్నవాళ్లకు 1:1 పద్ధతిలో బోనస్ షేర్లు ఇస్తామని అంబానీ ధృవీకరించారు. ఈ సమావేశంలోనే వారసులకు కంపెనీల బాధ్యతలు అప్పగించారు ముకేష్ అంబానీ. ఇషాకు రిటైల్, ఆకాశ్‌కి జియో, అనంత్‌కి న్యూ ఎనర్జీ బిజినెస్‌లు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అటు రిలయన్స్ గ్రూప్‌నకు చైర్మన్‌గా మరో ఐదేళ్ల పాటు ముకేష్ అంబానీ కొనసాగనున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి