AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రైలులో ఎప్పుడూ కింది సీటే కావాలా..? టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ సీక్రెట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..

రైలు ప్రయాణంలో కింది సీటు దొరికితే ఆ కిక్కే వేరు. ప్రశాంతంగా కూర్చోవచ్చు, కావలసినప్పుడు పడుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తూ వృద్ధులను వెంటబెట్టుకుని వెళ్తున్నా సరే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మనకు అప్పర్ బెర్త్ ఇచ్చి షాక్ ఇస్తుంటుంది. ప్రయాణంలో సీటు మార్చమని పక్కవారిని బ్రతిమాలే అవసరం లేకుండా.. టికెట్ బుక్ చేసేటప్పుడే లోయర్ బెర్త్ గ్యారెంటీగా పొందేందుకు ఐఆర్‌సీటీసీలో కొన్ని సీక్రెట్ ఆప్షన్లు ఉన్నాయి.

IRCTC: రైలులో ఎప్పుడూ కింది సీటే కావాలా..? టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ సీక్రెట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..
How To Get Lower Berth In Train
Krishna S
|

Updated on: Jun 09, 2026 | 12:17 PM

Share

మన దేశంలోని దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజల ఫస్ట్ చాయిస్ రైల్వే. రోజుల లక్షల మందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతాయి. ఎక్కడికైన కనెక్టివిటీ, తక్కువ ధర ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా సౌకర్యాలలోనూ మిగితా వాటిని కంటే రైళ్లు ప్రత్యేకం. అయితే, రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు చాలా మందికి పెద్ద వయసు వారు ఉన్నా సరే అప్పర్ బెర్త్ లేదా మిడిల్ బెర్త్ కేటాయిస్తుంటారు. దీనివల్ల వృద్ధులు, గర్భిణీలు, మహిళలు పైకి ఎక్కలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ప్రయాణంలో కింది సీటు ఉన్నవారిని బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే.. మీకు కింది సీటు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అసలు రైలులో సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?

రైలులో సీట్ల కేటాయింపు అనేది పూర్తిగా ఒక ఆటోమేటిక్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా జరుగుతుంది. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు. రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు దాని సమతుల్యత దెబ్బతినకుండా ఉండటానికి.. ఈ సాఫ్ట్‌వేర్ మొదట రైలు మధ్యలో ఉండే కోచ్‌లలోని సీట్లను కేటాయిస్తుంది. ఆ తర్వాతే లోయర్ డెక్, అప్పర్ డెక్ సీట్లను.. చివరగా సైడ్ బెర్త్‌లను భర్తీ చేసుకుంటూ వెళ్తుంది. సాధారణంగా లోయర్ బెర్త్‌ల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఒక్కోసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు పై సీట్లు వచ్చేస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి..

ట్రిక్ 1: రిజర్వేషన్ ఛాయిస్ ఆప్షన్ వాడండి

టికెట్లు బుక్ చేసేటప్పుడు ప్యాసింజర్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కింద Reservation Choice అనే విభాగం కనిపిస్తుంది. అందులో కొన్ని ఆప్షన్లు ఉంటాయి.

మీరు బుకింగ్ చేసేటప్పుడు “Book only if at least one lower berth is allotted” (కనీసం ఒక లోయర్ బెర్త్ కేటాయించబడితేనే బుక్ చేయండి) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా సిస్టమ్‌లో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ లోయర్ బెర్త్ లేకపోతే టికెట్ బుక్ కాదు, మీ డబ్బులు మీకు రీఫండ్ అయిపోతాయి. దీనివల్ల టికెట్ బుక్ అయ్యాక అప్పర్ బెర్త్ వచ్చిందని బాధపడే పరిస్థితి ఉండదు.

ట్రిక్ 2: సీనియర్ సిటిజన్ కోటా ఉపయోగించడం

మీ కుటుంబంలోని వృద్ధుల కోసం టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు, జనరల్ కోటాలో కాకుండా ఎల్లప్పుడూ Senior Citizen/Lower Berth Quota ను ఉపయోగించి బుక్ చేయండి. రైల్వే శాఖ ఈ కోటా కింద ప్రతి రైలులోనూ కొన్ని కింది సీట్లను ప్రత్యేకంగా కేటాయిస్తుంది. కాబట్టి ఈ కోటా ద్వారా బుక్ చేస్తే 90శాతం లోయర్ బెర్త్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

బుకింగ్ అయ్యాక పై సీటు వస్తే ఏం చేయాలి?

ఒకవేళ మీరు బుక్ చేసిన తర్వాత కూడా మీకు అప్పర్ బెర్త్ కేటాయిస్తే అస్సలు చింతించకండి. ప్రయాణికులలో ఎవరైనా వృద్ధులు, గర్భిణీలు లేదా దివ్యాంగులు ఉండి పై సీటు ఎక్కడం అసాధ్యం అనుకుంటే.. మీరు వెంటనే రైలులోని TTE ను సంప్రదించవచ్చు. రైలులో ఏవైనా లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నా లేదా వేరొకరు తమ సీటును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. సదరు సీట్లను మీకు కేటాయించే ప్రత్యేక అధికారం TTE కి ఉంటుంది.

Follow Us
ఉసిరితో జామ్.. పిల్లలకు బ్రెడ్‌తో తినిపించడానికి ఇదే బెస్ట్
ఉసిరితో జామ్.. పిల్లలకు బ్రెడ్‌తో తినిపించడానికి ఇదే బెస్ట్
వర్షంతో మారిన లెక్కలు.. క్వార్టర్స్‌లో టీమిండియాతో అఫ్ఘాన్ ఢీ
వర్షంతో మారిన లెక్కలు.. క్వార్టర్స్‌లో టీమిండియాతో అఫ్ఘాన్ ఢీ
తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..
తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..
టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..
టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..
రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది
రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది
పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.
పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.
ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే
ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది