Train Ticket: మీ తత్కాల్ టికెట్‌కు బెర్త్ కన్ఫామ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. జస్ట్ ట్రై!

|

Aug 10, 2022 | 1:00 PM

ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైల్వే టికెట్లకు సంబంధించి ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తోంది..

Train Ticket: మీ తత్కాల్ టికెట్‌కు బెర్త్ కన్ఫామ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. జస్ట్ ట్రై!
Train
Follow us on

ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైల్వే టికెట్లకు సంబంధించి ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తోంది. ప్రతీసారి ప్రయాణీకులకు రిజర్వ్ బెర్త్‌లు దొరకవు. ఆర్ఏసీ లేదా వెయింటింగ్ లిస్టు కూడా వస్తుంది. కొన్నిసార్లు మనం కంగారుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇక తత్కాల్ టికెట్ల విషయానికొస్తే.. బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యంగ్ కావడం ఖాయం. దీంతో తత్కాల్ వెయిటింగ్ లిస్టు వచ్చేస్తుంది. మరి తత్కాల్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే ఏం చేయాలి..? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ కచ్చితంగా పాటించాలి. ఏసీ టికెట్ల కోసం తత్కాల్ ఆప్షన్ ప్రతీ రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే స్లీపర్ క్లాస్ టికెట్ల కోసం బుకింగ్ ప్రక్రియ ప్రతీ రోజూ ఉదయం 11 గంటల నుంచి మొదలవుతుంది. ఈ సమయాల్లో తత్కాల్ టికెట్ బుక్ చేస్తే కచ్చితంగా బెర్త్ కన్ఫామ్ అయ్యేందుకు వీలుంటుంది. అయితే కొన్ని ట్రైన్స్‌కు తత్కాల్ ప్రక్రియ క్షణాల్లో కంప్లీట్ అవుతుంది. ఆ సమయంలో మీరు తత్కాల్ ఆప్షన్ బదులుగా ప్రీమియం తత్కాల్‌ను ఎంచుకోండి. అప్పుడు మీకు బెర్త్ దొరకవచ్చు. అలాగే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మీరు పాసెంజర్ల వివరాలను ముందుగా నమోదు చేసుకోవడం మంచిది. అలాగే పేమెంట్ ఆప్షన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐలను ఎంచుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..