iPhone 16: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.! ఐఫోన్ ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 24 వేలు తగ్గింపు.. ఎక్కడో కాదు ఇక్కడ

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. 2024లో విడుదలైన ఈ ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ. 1.15 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కలిపి రూ. 68 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

iPhone 16: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.! ఐఫోన్ ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 24 వేలు తగ్గింపు.. ఎక్కడో కాదు ఇక్కడ
Iphone 16 Pro Max

Updated on: Jan 14, 2026 | 1:16 PM

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ అద్భుతమైన పనితీరు, ప్రీమియం డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ టైటానియం డిజైన్‌ను కలిగి ఉండటం వల్ల తేలిగ్గా, స్ట్రాంగ్‌గా ఉంది. ఆపిల్ ఇన్-హౌస్ A18 ప్రో చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ 3nm టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది రోజువారీ పనులు, భారీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఐఫోన్ ఐదు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లతో లభిస్తోంది. ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్త. ఇక ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

దేశంలో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1.34 లక్షలకు లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్‌ను రూ. 1.14 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. రూ. 24 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో మరో రూ. 4 వేలు తగ్గింపును పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా పాత ఫోన్‌ను మార్చి మరో రూ. 68 వేలు వరకు ఆదా చేసుకోవచ్చు. 2024లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ A18 ప్రో చిప్‌సెట్, టైటానియం బాడీ, అద్భుతమైన కెమెరా సెటప్ ఉన్నాయి.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి