
మన దేశంలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారిపోతున్నాయి. కేవలం సంప్రదాయ మార్గాల్లోనే కాక, రిస్క్ ఎక్కువ ఉండే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. వీటిల్లో బలమైన రాబడి వస్తుండటంతో అందరూ వీటివైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రెండ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మార్కెట్లో అధిక రాబడిని అందించే మార్గాల్లో ఇది బెస్ట్ గా వారికి కనిపిస్తుంది. ఈ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ తో పాటు బంగారం కూడా పెట్టుబడిదారులకు మంచి ఆప్షన్ గా మారుతోంది. ఇటీవల కాలంలో బంగారంపై పెట్టుబడులు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇప్పటి నుంచే బంగారం పెట్టుబడులు పెడుతున్నా ఇప్పుడు ఇది ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. కేవలం భౌతిక బంగారంపై కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్జీబీ)లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు రూ. 27,031 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారని, ఇది 2022-23లో కొనుగోలు చేసిన బంగారు బాండ్లకు నాలుగు రెట్లు ఎక్కువని గణాంకాలు స్పష్టం చేస్తున్ానయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ద్వారా 44.34 టన్నుల బంగారాన్ని రూ.6,551 కోట్లకు కొనుగోలు చేశారు.
బాండ్లను జారీ చేసే రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో ఈ సమాచారం అంతా స్పష్టం ఇచ్చారు. నివేదిక ప్రకారం, 2023-24లో ఎస్జీబీలో నుంచి సేకరించిన మొత్తం రూ. 27,031 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్జీబీలను నాలుగు దశల్లో విడుదల చేశారు. నవంబర్, 2015లో ఎస్జీబీ పథకం ప్రారంభించినప్పటి నుంచి 67 విడతల్లో మొత్తం రూ.72,274 కోట్లు (146.96 టన్నులు) సేకరించారు. గత ఏడాది కాలంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.62,300 నుంచి రూ.73,200కి పెరిగింది.
ఎస్జీబీలు బంగారంతో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇవి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయాలు. ఈ బాండ్లకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను నుంచి కూడా మినహాయింపు ఉంది. ఇది కాకుండా, బాండ్‌పై ప్రారంభ పెట్టుబడి మొత్తంపై సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్జీబీలు ఒక గ్రాము బంగారం, దాని గుణిజాల విలువలతో జారీ చేస్తాయి. వ్యక్తులకు గరిష్ట పెట్టుబడి పరిమితి నాలుగు కిలోగ్రాములు అయితే కనీస పెట్టుబడి ఒక గ్రాము ఉండాలి.
ప్రభుత్వ గోల్డ్ బాండ్లను జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్), అధీకృత స్టాక్ ఎక్స్ఛేంజీల కార్యాలయాలు లేదా శాఖల ద్వారా నేరుగా లేదా వారి ఏజెంట్ల ద్వారా విక్రయిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..