Gold ETFs: బంగారంపై బంపర్ రిటర్న్స్.. క్యూ కడుతున్న పెట్టుబడిదారులు..

|

Sep 17, 2024 | 4:22 PM

2024లో ఇప్పటివరకు గోల్డ్ ఈటీఎఫ్ లు రూ.6,134 కోట్ల ఇన్‌ఫ్లో పొందాయి. ప్రస్తుతం దాదాపు 16 గోల్డ్ ఈటీఎఫ్ లు నడుస్తున్నాయి. బంగారంపై కస్టమ్ సుంకం తగ్గింపు తర్వాత ఆగస్టులో ఈటీఎఫ్ లో పెట్టుబడులు పెరిగాయి. అత్యధికంగా రూ.1,611 కోట్లకు చేరాయి. అలాగే ఆస్తులు 8.5 శాతం పెరిగాయి. పాసివ్ ఫండ్స్ విభాగంలో అత్యధికంగా నమోదయ్యాయి.

Gold ETFs: బంగారంపై బంపర్ రిటర్న్స్.. క్యూ కడుతున్న పెట్టుబడిదారులు..
Gold Etf
Follow us on

ప్రతి ఒక్కరూ తాము సంపాదించే ఆదాయంలో కొంతమేర పొదుపు చేస్తారు. దానిని వివిధ మార్గాలలో పెట్టుబడిగా పెట్టి రాబడిని పెంచుకుంటారు. దేశంలో ఇలాంటి పెట్టుబడి మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఎక్కువ మంది ఆసక్తి చూపేది బంగారం కొనుగోలుకే. భారతీయులకు బంగారమంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా మహిళలు తమ పొదుపును బంగారం కొనడానికే ఎక్కువశాతం వినియోగిస్తారు. అయితే బంగారాన్ని రెండు విధాలుగా కొనుగోలు చేయవచ్చు. షాపునకు వెళ్లి నచ్చిన డిజైన్ లో బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఇక రెండో విధానమంటే గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం. అంటే భౌతికంగా మన చేతిలో బంగారం ఉండదు. కానీ మన పేరుపై ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ టీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేటెడ్ ఫండ్. సాధారణ షేర్ల మాదిరిగానే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం బంగారం రికార్డు స్థాయికి చేరింది. 2024లో ఇప్పటివరకు గోల్డ్ ఈటీఎఫ్ లలో రూ.6,134 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ లకు వచ్చిన పెట్టుబడులను తెలుసుకుందాం.

గోల్డెన్ గెయిన్స్.. 2024లో ఇప్పటివరకు గోల్డ్ ఈటీఎఫ్ లు రూ.6,134 కోట్ల ఇన్‌ఫ్లో పొందాయి. ప్రస్తుతం దాదాపు 16 గోల్డ్ ఈటీఎఫ్ లు నడుస్తున్నాయి. బంగారంపై కస్టమ్ సుంకం తగ్గింపు తర్వాత ఆగస్టులో ఈటీఎఫ్ లో పెట్టుబడులు పెరిగాయి. అత్యధికంగా రూ.1,611 కోట్లకు చేరాయి. అలాగే ఆస్తులు 8.5 శాతం పెరిగాయి. పాసివ్ ఫండ్స్ విభాగంలో అత్యధికంగా నమోదయ్యాయి.

నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్.. ఈ ఫండ్ ఈ ఏడాదిలో అత్యధికంగా రూ.4,025 కోట్ల ఇన్ ఫ్లో ను అందుకుంది. ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.1,347 కోట్లు వచ్చింది.

హెచ్ డీఎఫ్ సీ గోల్డ్ ఈటీఎఫ్.. ఈ ఫండ్ లో కూడా ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ. 1,421 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది. ఆగస్టులో అత్యధికంగా రూ.426 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.

హెచ్ డీఎఫ్ సీ గోల్డ్ ఈటీఎఫ్.. ఈ ఫండ్ ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 1,421 కోట్ల ఇన్‌ఫ్లో అందుకుంది, ఆగస్టులో వచ్చిన పెట్టుబడులు రూ.426 కోట్లు

దాదాపు రూ.300 కోట్లు.. యూటీఐ గోల్డ్, మిరే అసెట్ గోల్డ్, డీడిఎస్‌పీ గోల్డ్ ఈటీఎఫ్ లు ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.356, రూ.338, రూ.304 కోట్ల చొప్పున ఇన్‌ఫ్లో అందుకున్నాయి.

మరో మూడింటికి ఆదరణ.. యాక్సిస్ గోల్డ్, ఆదిత్య బిర్లా ఎస్ ఎల్ గోల్డ్, టాటా గోల్డ్ ఈటీఎఫ్ లకు ప్రజల ఆదరణ లభించింది. వీటిలో వరసగా రూ.194, రూ.133, రూ.126 కోట్ల ఇన్‌ఫ్లోలలు అందాయి.

తక్కువ ఇన్ ఫ్లోలు.. జెరోధా గోల్డ్, ఎల్ఐసీ ఎంఎఫ్ గోల్డ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ లలో రూ. 38.47, రూ. 24.75, రూ. 21.50 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

రూ.10 కోట్ల లోపు.. బరోడా బీఎన్‌పీ పారిబాస్ గోల్డ్, ఎడెల్‌వీస్ గోల్డ్ ఈటీఎఫ్ లకు ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.9.59, రూ.8.45 కోట్లు వచ్చాయి.

ఐసీఐసీఐ.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ 2024లో ఇప్పటివరకు రూ.102 కోట్ల అవుట్‌ఫ్లోను చూసింది, దీనికి ఏప్రిల్‌లో అత్యధికంగా రూ. 503 కోట్లు వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..