Silver Rates: రికార్డులన్నీ బద్దలే.. బంగారాన్ని మించి పెరుగుతున్న వెండి ధరలు.. ఏడాదిలోనే..

ఏడాది క్రితం మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే... అది ఇప్పుడు 2 లక్షల 15 వేల రూపాయలు అయ్యేది. అంటే వంద శాతం పైగా పెరిగేది. మీకు లక్ష రూపాయల పైనే లాభం వచ్చేది. అయితే మీరు ఏం చేసి ఉంటే అంత లాభం వచ్చేదో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే వాచ్‌ దిస్‌ స్టోరీ.

Silver Rates: రికార్డులన్నీ బద్దలే.. బంగారాన్ని మించి పెరుగుతున్న వెండి ధరలు.. ఏడాదిలోనే..
Silver Rates

Updated on: Dec 14, 2025 | 9:18 AM

కొండలా పెరుగుతోంది..ఎంతకీ తగ్గనంటోంది. బంగారాన్ని మించి పెరుగుతోంది వెండి కొండ. యస్‌…వెండి ప్రియులకు బిగ్ బిగ్ షాక్. సిల్వర్‌ను చూడడమే కానీ, టచ్‌ చేసే సాహసం చేయడం ఇక సాధ్యం కాదు. ఎందుకంటే అది ఆల్‌ టైమ్‌ రికార్డు రేట్లను టచ్‌ చేసింది. వెండి రేటు కొండలా పెరుగుతుంటే..సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఈ ఒక్క వారంలోనే వెండి పరుగులు చూస్తే బాబోయ్‌ అనాల్సిందే!

ఏడాది కిందట కిలో వెండి రేటు… లక్ష రూపాయల లోపలే ఉండేది. ఇప్పుడు అది ఏకంగా రెండు లక్షల రూపాయల మార్కును దాటిపోయింది. అయినా ఇంకా పరిగెడతానంటోంది. ఈ సిల్వర్‌ పరుగులు ఎందాకా అనేది నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. బంగారం ఎటు కొనలేకపోతున్నాం…వెండితో అయినా సరిపెట్టుకుందాం అనుకునేవారికి, సిల్వర్ షాక్‌ గట్టిగానే తగులుతోంది. ఇప్పుడు దేశీయంగా సిల్వర్ రేట్లు సరికొత్త జీవన కాల గరిష్టాన్ని నమోదు చేశాయి. రజతం రేటు ఆల్ టైమ్ హై మార్కును దాటి ఇంకా దూసుకెళ్తూనే ఉంది. వెండి పరుగుల ముందు పసిడి వెలవెలబోతోంది.

2024 డిసెంబర్‌ 31న కిలో వెండి రేటు రూ. 89,700

గత ఏడాది డిసెంబర్‌లో సిల్వర్‌ మారథాన్‌ ప్రారంభమైంది. మధ్యలో కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌ లేకుండా ఫుల్ స్పీడుతో సిల్వర్‌ రేట్లు పరుగులు తీస్తున్నాయి. ఈ ఒక్క వారంలోనే వెండి ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది నుంచి ఇప్పటిదాకా వెండి రేట్లు భారీగా పెరగడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. 2024 డిసెంబర్‌ 31న కిలో వెండి రేటు రూ. 89,700 ఉంది. లేటెస్టుగా కిలో వెండి రేటు…రూ. 2.15 లక్షల మార్కును టచ్‌ చేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఏడాదిలో వంద శాతం పైగా సిల్వర్‌ రేటు పెరిగింది. ఇక వెండి రేటు, గత 5 రోజుల్లోనే రూ. 19,100 పెరిగింది

ఫెడ్‌ కోతలు, రూపాయి పతనంతో వెండి రేట్లకు రెక్కలు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చేపట్టిన వడ్డీ రేట్ల కోతలు, రూపాయి పతనంతో వెండి రేట్లకు రెక్కలు వచ్చాయని అనలిస్టులు చెబుతున్నారు. ఇదే సమయంలో డాలర్‌ బలహీనపడడం..రేట్ల ర్యాలీకి మరో కారణమట! ఇక ఇండస్ట్రియల్‌ డిమాండ్‌ కూడా పెరగడంతో సిల్వర్‌ రేట్లకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఇంత భారీగా వెండి రేట్లు పెరగడంతో, దాని అమ్మకాలు 10 శాతం దాకా క్షీణించాయని వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్తులో సిల్వర్‌ రేట్లు ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో వెండి ప్రియులు బెంబేలెత్తుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..