తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడికి మంచి మార్గం..SIPతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్

|

Apr 04, 2022 | 5:31 PM

Systematic Investment Plan: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మార్గాలున్నాయి. మీరు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడికి మంచి మార్గం..SIPతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్
Money Earning
Follow us on

Systematic Investment Plan: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మార్గాలున్నాయి. మీరు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. తక్కువ డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. SIP అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒక సులువైన మార్గం. మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. SIP ద్వారా ప్రతి నెలా కనీసం రూ.500 పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు. మీరు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) ద్వారా నేరుగా మ్యూచువల్ ఫండ్ల డైరెక్ట్ ప్లాన్‌లలో ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీరు ఫండ్ హౌస్ బ్రాంచ్‌కి వెళ్లి మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ నింపాలి. KYCని పూర్తి చేయడానికి పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు మీ గుర్తింపు, చిరునామా రుజువు సమర్పించాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి..?

మీరు మ్యూచువల్ ఫండ్ ప్లాన్లలో ఆన్‌లైన్‌లో లేదా AMC వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకోసం మీరు పేరు, బ్యాంక్ వివరాలతో మ్యూచువల్ ఫండ్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దీంతో పాటు eKYC కోసం పాన్, ఆధార్ సమాచారం అందించాలి. మీరు ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతా ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

1. ముందుగా మీరు ఫండ్ హౌస్ వెబ్‌సైట్‌కి వెళ్లి మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను ఎంచుకోండి.

2. మీ పేరు, మొబైల్ నంబర్, పాన్ వంటి అవసరమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. మీ పేరుపై ఒక పాస్‌వర్డ్ క్రియేట్‌ అవుతుంది.

3. మీరు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి SIP ఆటో-డెబిట్ మొత్తాన్ని సెట్ చేయండి.

4. మొదటి SIP వాయిదాను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

5. మీరు ఎంచుకున్న టర్మ్ ముగిసే వరకు SIPని కొనసాగించవచ్చు.

Health Photos: గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Gas Cylinder: వంట గ్యాస్ అయిపోవచ్చిందా.. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా ఇలా సిలిండర్ బుక్ చేయండి..!

CLAT Exam 2022: జూన్‌లో CLAT పరీక్ష.. పరీక్షా సరళి, సిలబస్ గురించి తెలుసుకోండి..!