International Girl Child Day 2023: మీ ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్లాన్ చేయడం మర్చిపోవద్దు

|

Oct 11, 2023 | 2:18 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఈ సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ ఒకటి. ఇది ఆడ పిల్లల భవిష్యత్తును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం మెచ్యూర్‌ అయిన తర్వాత ఆడ పిల్లల విద్య, వివాహం కోసం ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పోస్టాఫీసు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ఈ పథకం అకౌంట్‌ తీసుకోవాలంటే ఆడ పిల్లల పేరుపై తల్లిదండ్రుల..

International Girl Child Day 2023: మీ ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్లాన్ చేయడం మర్చిపోవద్దు
International Girl Child Day 2023
Follow us on

అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం. నేటి కాలంలో స్త్రీ ఒంటరిగా ఉండకూడదు. చాలా రంగాలలో ఆడవారు మగవారితో సమానంగా పోటీపడుతున్నారు. చదువుకున్న అమ్మాయి ఏ కుటుంబానికైనా విలువైన ఆస్తి. ఆడపిల్లలకు అవసరమైన విద్య తదితరాలు అందించడం తల్లిదండ్రుల ప్రాథమిక కర్తవ్యం. ఈరోజు ఆడపిల్లల దినోత్సవం కాబట్టి ప్రభుత్వం బాలికల కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన గురించి సమాచారం ఇవ్వడం చాలా సముచితంగా అనిపిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి?

ఇది ఆడపిల్లల భవిష్యత్తు, విద్య, తల్లిదండ్రుల పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పథకం. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరిట ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. పథకం 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది నెలవారీ లేదా వార్షికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుకు పన్ను మినహాయింపు ఉంటుంది.

ఈ పథకం 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. అయితే ఈ పథకంలో భాగంగా 50% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టిన పెట్టుబడి 8% వడ్డీ అందిస్తారు. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి సంవత్సరం సవరిస్తుంది. కొన్నిసార్లు పెరగవచ్చు.. తగ్గవచ్చు. లేదా స్థిరంగా ఉండవచ్చు.

ఎంత పెట్టుబడికి ఎంత రాబడి?

మీరు ఈ సంవత్సరం (2023) సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించారని అనుకుందాం. ఇది 2044 నాటికి మెచ్యూరిటీ అవుతుంది. మీరు 15 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టండి. మీ మొత్తం పెట్టుబడి రూ.22,50,000 అవుతుంది. ఇది 2044లో మెచ్యూర్ అయినప్పుడు, వడ్డీతో సహా మీ పెట్టుబడి మొత్తం రూ.67,34,534 అవుతుంది. అంటే, మీ పెట్టుబడి మూడు రెట్లు పెరుగుతుంది.

దీనికి అదనంగా మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల పన్ను ఆదాను లెక్కించినట్లయితే సుకన్య సమృద్ధి యోజన నుంచి ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది. మీకు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల ఉంటే, ఈరోజే ఈ పథకాన్ని పొందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఈ సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌ ఒకటి. ఇది ఆడ పిల్లల భవిష్యత్తును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం మెచ్యూర్‌ అయిన తర్వాత ఆడ పిల్లల విద్య, వివాహం కోసం ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పోస్టాఫీసు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ఈ పథకం అకౌంట్‌ తీసుకోవాలంటే ఆడ పిల్లల పేరుపై తల్లిదండ్రుల సంరక్షకులుగా ఉండి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌ తీసుకోవడం వల్ల తల్లిదండ్రులకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.