Budget 2024: ఈ బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ పన్ను స్లాబ్‌ విధానంలో మార్పు చేయనున్నారా?

|

Jan 23, 2024 | 3:10 PM

పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ పాత పన్ను విధానాన్నే ఇష్టపడుతున్నారు. కొత్త పన్నుల విధానాన్ని ప్రభుత్వం మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలంటే ఈ విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు, ప్రభుత్వం వ్యక్తిగత పన్ను రేటు పరిమితిని మార్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం గరిష్ట పన్ను రేటు పరిమితిని 30 శాతం..

Budget 2024: ఈ బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ పన్ను స్లాబ్‌ విధానంలో మార్పు చేయనున్నారా?
Tax
Follow us on

మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1, 2024న ప్రకటించనున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు గత బడ్జెట్‌లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. అయితే, దేశంలోని 60 శాతం పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ పాత పన్ను విధానాన్నే ఇష్టపడుతున్నారు. కొత్త పన్నుల విధానాన్ని ప్రభుత్వం మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలంటే ఈ విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు, ప్రభుత్వం వ్యక్తిగత పన్ను రేటు పరిమితిని మార్చాల్సి ఉంటుంది.

ప్రభుత్వం గరిష్ట పన్ను రేటు పరిమితిని 30 శాతం (ప్రస్తుతం రూ. 15,00,000) నుంచి కనీసం రూ. 20,00,000కి పెంచాల్సి ఉంటుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా, ఉపాంత రేటును 25 శాతానికి తగ్గించవచ్చు. ఈ మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులు ఎక్కువ పన్ను ఆదా చేసుకోగలుగుతారు. ఇది పన్ను చెల్లింపుదారులను పాత విధానాన్ని విడనాడి కొత్త పన్ను విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహిస్తుంది.

ప్రతి సంవత్సరం 1 లక్ష ఆదా:

ఇవి కూడా చదవండి

పరిమితిని సంవత్సరానికి రూ. 25,00,000కి పెంచినట్లయితే, రూ. 30,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న పన్ను చెల్లింపుదారు సంవత్సరానికి రూ. 1,04,000 పన్ను ఆదా చేయవచ్చు. రూ.25,00,000 సంపాదించే వ్యక్తులు రూ.98,800 ఆదా చేసుకోవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఉపశమనం ఎలా పొందాలి?

బడ్జెట్‌లో పన్ను రేటు పరిమితిని రూ.20,00,000కి పెంచినట్లయితే, వార్షికంగా రూ. 25,00,000 కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులు రూ.52,000 ఆదా చేయగలరు. అదేవిధంగా, సంవత్సరానికి రూ. 20,00,000 సంపాదించే వ్యక్తి సంవత్సరానికి అదనంగా రూ. 46,800 ఆదా చేయగలడు. అయితే, ఈ మార్పు సంవత్సరానికి రూ. 10,00,000 సంపాదించే వ్యక్తులపై ప్రభావం చూపదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి