Lakhpati didi yojana: వడ్డీ లేకుండా రూ. 5లక్షల వరకూ రుణం.. మహిళలకు వరం ఈ పథకం.. అర్హతలు ఇవే..

|

Mar 28, 2024 | 8:58 AM

మోదీ ప్రభుత్వం ప్రకటించిన లక్షపతి దీదీ యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. రుణ పరిమితి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందిస్తోంది. అయితే స్వయం సహాయక బృందం (ఎస్ హెచ్ జీ)లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు.

Lakhpati didi yojana: వడ్డీ లేకుండా రూ. 5లక్షల వరకూ రుణం.. మహిళలకు వరం ఈ పథకం.. అర్హతలు ఇవే..
Money
Follow us on

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం, అలాగే సమాజం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నాయి. వివిధ శిక్షణ కార్యక్రమాలతో వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. అన్ని విధాలా అండగా నిలబడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ఢిల్లీలో మహిళల కోసం లక్షపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా మహిళలను లక్షాధికారులను చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తారు. తమ కాళ్లపై నిలబడేలా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సాయం అందజేస్తారు. తద్వారా వారు ఆదాయ వనరులను కల్పించుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షపతి దీదీ యోజన పథకం అంటే ఏమిటి? దానిలో ప్రయోజనాలు ఏమిటి? అర్హతలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

లక్షపతి దీదీ యోజన పథకం..

మోదీ ప్రభుత్వం ప్రకటించిన లక్షపతి దీదీ యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. రుణ పరిమితి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందిస్తోంది. అయితే స్వయం సహాయక బృందం (ఎస్ హెచ్ జీ)లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు.

ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా..

గతేడాది ఈ పథకం కింద సుమారు 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌లో ఆ సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

స్వయం సహాయ సంఘాల మహిళల కోసం..

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి, నెలకు కొంత ఆదాయం పొదుపు చేస్తారు. వాటితో ఒకరి కొకరు రుణాలు ఇచ్చుకుంటారు. వీటినే స్వయం సహాయక బృందాలు అని పిలుస్తారు. 2023 డిసెంబర్ లో విడుదలైన దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై – ఎన్ ఆర్ఎల్ఎమ్) వివరాల ప్రకారం.. దేశంలో సుమారు 100 మిలియన్ల మంది మహిళా సభ్యులతో 90 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.

ఉపాధి కల్పన..

లక్షపతి దీదీ యోజన పథకాన్ని ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. మహిళలకు వ్యాపార శిక్షణ అందించడం, వస్తువులను మార్కెట్‌కి తరలించడం, విక్రయాలకు సంబంధించి అవసరమైన, శిక్షణ అందిస్తారు. https://lakhpatididi.gov.in/ వెబ్ సైట్ లో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. పౌల్ట్రీ ఫార్మింగ్, ఎల్ఈడీ బల్బుల తయారీ, వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం, స్ట్రాబెర్రీ సాగు, పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, హస్తకళా వస్తువుల తయారీ తదితర వాటి కోసం రుణాలు మంజూరు చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యాపారం ప్రారంభించుకునేందుకు నగదును రుణం రూపంలో మంజూరు చేస్తారు. దీనికి వడ్డీ కూడా ఏమి ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..