Debit Card Insurance: ఏటీఎం కార్డుపై కూడా ఇన్సూరెన్స్.. ఎలా అప్లై చేయాలో తెలుసా..?

|

Oct 22, 2024 | 2:10 PM

భారతదేశంలో చాలా ఏళ్లుగా కుటుంబ వ్యవస్థ అనేది కుటుంబ పెద్దపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇంట్లో ఓ వ్యక్తి సంపాదనపై కుటుంబం మొత్తం జీవిస్తూ ఉంటారు. అయితే అనుకోని సందర్భంలో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది అవుతుంది. ఈ నేపథ్యంలో పలు బీమా కంపెనీలు ప్రత్యేక బీమా పథకాల ద్వారా కుటుంబ పెద్ద లేని సమయంలో ఆర్థికంగా ఆదుకుంటాయి. అయితే ఇటీవల ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే బ్యాంకు అకౌంట్ ద్వారా వచ్చే డెబిట్ కార్డుపై ఇన్సూరెన్స్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Debit Card Insurance: ఏటీఎం కార్డుపై కూడా ఇన్సూరెన్స్.. ఎలా అప్లై చేయాలో తెలుసా..?
Debit Card
Follow us on

డెబిట్ కార్డ్ సాధారణంగా ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలా మందికి ఒకటి లేదా రెండు బ్యాంకుల డెబిట్ కార్డులు ఉంటున్నాయి. మీకు డెబిట్ కార్డ్ కూడా ఉంటే దానిపై వచ్చే సౌకర్యాల గురించి కూడా మీరు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి డెబిట్ కార్డ్ వినియోగదారులకు బ్యాంక్ ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని అందిస్తుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా మోసం జరిగినప్పుడు ఇది కార్డ్ హోల్డర్‌కు రక్షణను అందిస్తుంది. చాలా బ్యాంకులు డెబిట్ కార్డ్ వినియోగదారులు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు బీమాను క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పిస్తున్నాయి. వివిధ బ్యాంకులు డెబిట్ కార్డులపై వారి ఎంపిక ప్రకారం బీమాను అందిస్తాయి. 

కొన్ని బ్యాంకులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కార్డుదారుని కుటుంబానికి రూ.4 నుంచి రూ.10 లక్షల వరకు కవరేజీ ఇస్తుండగా చాలా బ్యాంకుల్లో రూ.3 కోట్ల వరకు జీవిత బీమా అందుబాటులో ఉంది. జీవిత బీమా క్లెయిమ్‌లకు సంబంధించి అన్ని బ్యాంకులు వేర్వేరు షరతులను విధిస్తున్నాయి. కాబట్టి డెబిట్ కార్డ్ పొందేటప్పుడు మీ బ్యాంక్‌తో ఈ విషయాల వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు  మీరు ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌ని కూడా ఉపయోగిస్తుంటే గోల్డ్, ప్రీమియం మొదలైన కార్డులపై బ్యాంక్ విభిన్న కవరేజీ అందుబాటులో ఉంటుంది. కార్డుదారుడు ప్రమాదంలో మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని కుటుంబం బ్యాంకు నుండి రూ. 4 నుండి 10 లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది.

ప్రముఖ బ్యాంకు ఐసీఐసీఐ రూ. 50 వేల నుంచి రూ. 30 లక్షల వరకు బీమా క్లెయిమ్‌లను ఇస్తుంది. హెచ్‌డీఎప్‌సీ కార్డ్‌లపై రూ. 5 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు బీమా రక్షణను పొందవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా రూ. 50 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. అయితే బ్యాంకులు ఈ క్లెయిమ్‌లను తీసుకోవడానికి సమయ పరిమితిని నిర్ణయించాయి. కాబట్టి క్లెయిమ్‌కు సంబంధించిన షరతుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెబిట్ కార్డ్‌పై స్వీకరించిన బీమా క్లెయిమ్‌ను సేకరించేందుకు బ్యాంక్ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ కార్డుకు సంబంధించిన వివరాలను పొంది, బ్యాంకు నిబంధనలు, షరతుల ప్రకారం దరఖాస్తు చేయాలి. కార్డ్ హోల్డర్ నామినీని నమోదు చేస్తే అతను క్లెయిమ్‌కు మొదటి క్లెయిమ్‌దారు అవుతాడు. ఇది కాకుండా క్లెయిమ్ తీసుకోవడానికి కేవైసీ పొందడం అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమాను క్లెయిమ్ చేయడానికి కార్డుదారుని మరణ ధ్రువీకరణ పత్రం, కేవైసీ సంబంధిత పత్రాలను సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..