Infosys: ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చిన ఇన్ఫోసిస్‌.. ఏడాదిలో రెండు సార్లు వేత‌నాలు పెంచిన టెక్ దిగ్గ‌జం..

Infosys: దేశంలోని ప్ర‌ముఖ ఐటీ సేవ‌ల సంస్థ‌ల్లో ఒక‌టి అయిన ఇన్ఫోసిస్ త‌మ ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చింది. ఉద్యోగాల జీతాల‌ను పెంచ‌నున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు. పెరిగిన వేత‌నాలు జూలై నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు తెలిపారు...

Infosys: ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చిన ఇన్ఫోసిస్‌.. ఏడాదిలో రెండు సార్లు వేత‌నాలు పెంచిన టెక్ దిగ్గ‌జం..
Infosys

Updated on: Jun 20, 2021 | 6:07 AM

Infosys: దేశంలోని ప్ర‌ముఖ ఐటీ సేవ‌ల సంస్థ‌ల్లో ఒక‌టి అయిన ఇన్ఫోసిస్ త‌మ ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చింది. ఉద్యోగాల జీతాల‌ను పెంచ‌నున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు. పెరిగిన వేత‌నాలు జూలై నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉంటే స‌హ‌జంగా ఏడాదిలో ఒక‌సారి జీతాలు పెంచుతాయి సంస్థ‌లు. కానీ ఇన్ఫోసిస్ ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో రెండు సార్లు వేత‌నాలు పెంచ‌డం విశేషం. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇన్ఫీ త‌మ ఉద్యోగుల‌కు జీతాల‌ను పెంచింది.

ఇదిలా ఉంటే.. వలసలను తగ్గించడానికి, నైపుణ్యం కలిగిన సిబ్బందిని తిరిగి రప్పించడానికి సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే జీతాల‌ను పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. శనివారం కంపెనీ 40వ వార్షికోత్సవ సాధారణ సమావేశంలో కంపెనీ సీవోవో ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ..ఐటీ సేవలకు డిమాండ్‌ నెలకొనడంతో భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు, గతేడాదితో పోలిస్తే వలసలు అధికంగా ఉండటం కూడా మరో కారణమని వెల్లడించారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు.

Also Read: Swiss Banks : స్విస్ బ్యాంకులో భారతీయల సంపదపై కేంద్ర ఆర్థిక‌ మంత్రిత్వ‌శాఖ‌ కీలక వ్యాఖ్యలు, ఇదీ సంగతంటూ వివరణ

Cibil Score: సిబిల్‌ స్కోర్ తక్కువున్నా బ్యాంక్ లోన్..! కానీ, కొన్ని కండీషన్స్… అవేంటో తెలుసా?

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా? కొత్తది ఎలా పొందాలో తెలుసుకుందాం!