Infosys News: ఇన్ఫోసిస్ కు తిప్పలు తెచ్చిన కొత్త నిబంధనలు.. మరోపక్క వేలల్లో ఉద్యోగుల రాజీనామాలు..

|

Apr 28, 2022 | 9:02 PM

Infosys News: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గణాంకాల ప్రకారం గడచిన మూడు నెలల కాలంలో 80 వేల మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ఈ సమయంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..

Infosys News: ఇన్ఫోసిస్ కు తిప్పలు తెచ్చిన కొత్త నిబంధనలు.. మరోపక్క వేలల్లో ఉద్యోగుల రాజీనామాలు..
Infosys
Follow us on

Infosys News: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గణాంకాల ప్రకారం గడచిన మూడు నెలల కాలంలో 80 వేల మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ఈ సమయంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. తమ కంపెనీలో రాజీనామా(Resignation) చేసిన ఉద్యోగులు పోటీ కంపెనీల్లో ఏడాది పాటు ఉద్యోగం చేయకూడదంటూ ఇన్ఫోసిస్‌ నిబంధనను తీసుకొచ్చింది. ఈ వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు కేంద్రాన్ని సంప్రదించాయి. మరో పక్క కంపెనీ కూడా వెనక్కు తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతోంది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కేంద్ర కార్శిక శాఖ(Labour Ministry) ఈ రోజు(2022 ఏప్రిల్‌ 28) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ దీనికి కంపెనీ ప్రతినిధులు డుమ్మా కొట్టారు.

టెక్ దిగ్గజం కొత్త నిబంధనలు దేశంలోని కార్మిక చట్టాలను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్‌) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో రాజీనామా చేసిన ఉద్యోగులు తిరిగి వేరే కంపెనీలో ఏడాది పాటు చేరకూడదనే నిబంధనపై చర్చించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఇన్ఫోసిస్‌ సంస్థకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ ఈ సమావేశానికి హాజరుకాలేమంటూ ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు తెలిపారు. దీంతో కనీసం
వీడియో కాన్ఫరెన్స్ లోనైనా చర్చలకు రావాలని సూచించినప్పటికీ వారు నిరాకరించారు. దీంతో ఈ అంశంపై వచ్చే నెల 16న చర్చించాలని కార్శిక శాఖ నిర్ణయించింది.

ఇన్ఫోసిస్‌ మాత్రం తాను తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తిస్తోంది. దీని వల్ల తమ హక్కులను ఇన్ఫోసిస్‌ కాలరాస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదురుతోంది. ఇన్ఫోసిస్‌ తరహాలోనే మరిన్ని కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల రక్షణ మాటేమిటని వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల జోక్యం పెరిగితే కార్పొరేట్‌ కంపెనీలు ఎలా స్పందిస్తాయనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఫైనల్ గా ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందేనని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!

PhonePe: బంగారం ప్రియులకు మెగా క్యాష్ బ్యాక్.. అక్షయ తృతీయకు ఫోన్ పే భారీ డిస్కౌంట్..