Infinix: పదివేల బడ్జెట్‌లో 2 స్మార్ట్ ఫోన్లను రిలీజ్‌ చేసిన ఇన్‌ఫినిక్స్.. అదిరిపోయే ఫీచర్లు..

Infinix: ప్రస్తుతం రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదల అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను

Infinix: పదివేల బడ్జెట్‌లో 2 స్మార్ట్ ఫోన్లను రిలీజ్‌ చేసిన ఇన్‌ఫినిక్స్.. అదిరిపోయే ఫీచర్లు..
Infinix Hot 11

Updated on: Sep 17, 2021 | 8:05 PM

Infinix: ప్రస్తుతం రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదల అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను తయారు చేస్తున్నాయి పలు మొబైల్‌ కంపెనీలు. ఇక హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఈ రోజు భారతదేశంలో హాట్ 11 సిరీస్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఇందులో హాట్ 11, హాట్ 11 ఎస్‌ను ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు పదివేల బడ్జెట్‌లో ఉన్నాయి. ఇన్‌ఫినిక్స్ హాట్ 11S మెడిటెక్ హీలియో G88 ప్రాసెసర్‌తో వస్తుంది. అద్భుతమైన డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 11S ఒకే 4GB + 64GB వేరియంట్ ధర రూ.10,999. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్ వేవ్, పోలార్ బ్లాక్, 7 డిగ్రీ పర్పుల్ అనే మూడు రంగులలో రిలీజ్‌ అయింది. ఇది సెప్టెంబర్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరోవైపు హాట్11 ధర రూ .8999. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది 7 డిగ్రీ పర్పుల్, సిల్వర్ వేవ్, ఎమరాల్డ్ గ్రీన్, పోలార్ బ్లాక్‌తో సహా విభిన్న రంగు ఎంపికలలో లభిస్తుంది.

ఇన్‌ఫినిక్స్ హాట్ 11 ఎస్, హాట్ 11 స్పెసిఫికేషన్‌లు
ఇన్ఫినిక్స్ హాట్ 11S 6.78-అంగుళాల డిస్‌ప్లేతో FHD+ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ మూలల చుట్టూ చాలా సన్నని బెజెల్స్ ఉంటాయి. మరోవైపు హాట్ 11 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 11S వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను 50 MP ప్రైమరీ సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్, AI లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. హాట్ 11 వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, AI లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 11S 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. హాట్ 11 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5200 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

OLA e Scooter: రెండు రోజులు.. 1100 కోట్లు.. చరిత్ర సృష్టించిన ఓలా స్కూటర్! మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే..

Big News Big Debate: పగిలిన కారు అద్దాలు.. చిరిగిన చొక్కాలు.. ఉండవల్లి యుద్ధంలో ఎవరి పాత్ర?

Drugs Case: కెల్విన్‌తో ఉన్న లింక్‌లేంటి? జీషాన్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ పేరెందుకుంది? తనీష్‌కు 8 గంటల పాటు ప్రశ్నలు