CNG Price Hike: సామాన్యుడికి మరోసారి షాక్.. పెరిగిన CNG ధర.. నాలుగు రోజుల్లో రెండోసారి!
సామాన్యుడు మరోసారి ద్రవ్యోల్బణం బారిన పడ్డాడు. నాలుగు రోజుల్లో రెండోసారి CNG ధర పెరిగింది.
CNG Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరంగా ప్రజలకు షాక్‌లు ఇస్తోంది. ఢిల్లీలో CNG ధర మళ్లీ పెరిగింది. ఢిల్లీలో సీఎన్‌జీ ధర రూ.2.5 పెరగగా, నేడు ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.64.11గా ఉంది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు సీఎన్‌జీ రేటును కూడా పెంచగా, నోయిడాలో గత 24 గంటల్లో సీఎన్‌జీపై రూ.2.80 పైసలు పెరిగింది.
సామాన్యుడు మరోసారి ద్రవ్యోల్బణం బారిన పడ్డాడు. నాలుగు రోజుల్లో రెండోసారి CNG ధర పెరుగుదల నమోదు చేసుకుంది . ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) ఢిల్లీలో సిఎన్‌జి ధరలను కిలోకు రూ.2.5 పెంచింది. ధర పెరుగుదల కారణంగా ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.64.11కి చేరింది. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు, కొత్త ఆర్థిక సంవత్సరం 2022 23 మొదటి రోజు అంటే ఏప్రిల్ 1న, CNG ధరలు కిలోకు 80 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. పైప్డ్ నేచురల్ గ్యాస్ ( PNG ) ధరలను కూడా పెంచారు. ఇన్‌పుట్ గ్యాస్ ధర పెరుగుదలను కవర్ చేయడానికి ఈ పెంపుదల చేసినట్లు కంపెనీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. IGL దేశీయ క్షేత్రాల నుండి సహజ వాయువును కొనుగోలు చేస్తుంది. అలాగే దిగుమతి చేసుకున్న LNG ని కొనుగోలు చేస్తుంది .
స్పాట్ లేదా ప్రస్తుత మార్కెట్‌లో LNG ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం ప్రభుత్వం స్థానిక క్షేత్రాల నుండి ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరను మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌లకు US$2.9 నుండి US$6.10కి పెంచింది.
పెంపు తర్వాత CNG కొత్త రేట్లు ఇలా ఉన్నాయిః
- ఢిల్లీ కిలో రూ.64.11
- నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ కిలో రూ.66.68
- ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ కిలో రూ.71.36
- గురుగ్రామ్ కిలో రూ.72.45
- రేవారి కిలో రూ.74.58
- కాన్పూర్, హమీర్‌పూర్, ఫతేపూర్ కిలో రూ.75.90
- కర్నాల్ , కైతాల్ కిలో రూ.72.78
- అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్ కిలో రూ.74.39
ఈ ఏడాదిలో మొత్తంగా చూస్తే.. సీఎన్‌జీ ధర రూ.11 పెరిగింది. దీంతో ఐజీఎల్ ధర పెరిగిందని, దీంతో ధరల పెంపు తప్పదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మాత్రమే కిలోకు దాదాపు రూ.11 వరకు ధరలు పెరిగాయి. ఇదిలావుంటే, CNG ధరల పెరుగుదల దృష్ట్యా, ప్రయాణీకుల కోసం క్యాబ్ ఎయిర్ కండీషనర్‌ను ప్రారంభించటానికి మేము అనుకూలంగా లేమని ఢిల్లీలోని ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పారు. పెరిగిన ధర మన బడ్జెట్‌పై ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.8.40, ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెరిగిన తర్వాత సీఎన్‌జీ ధరలను పెంచారు. రికార్డు స్థాయిలో 137 రోజుల విరామం తర్వాత మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు జరిగింది. అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.949.50కి పెరిగింది. కొన్ని చోట్ల ఎల్పీజీ ధర రూ.1000కు చేరింది.