Mexico Tariffs: భారత్‌పై టారీఫ్స్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ బాటలో మరో దేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!

Mexico Import Tariffs: భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికన్ సెనెట్ బుధవారం రోజు ఆమోదం తెలిపింది. ఈ దేశాల దిగుమతి బిల్లు మరింత భారంగా మారనుంది..

Mexico Tariffs: భారత్‌పై టారీఫ్స్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ బాటలో మరో దేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!

Updated on: Dec 14, 2025 | 10:23 AM

Mexico Import Tariffs: దిగుమతి వస్తువులపై సుంకాల విషయంలో అగ్రరాజ్యం అమెరికా బాటలోనే మెక్సికో నడుస్తోంది. ముఖ్యంగా తమ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలను భారీగా పెంచేందుకు మెక్సికో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు మెక్సికో సెనెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయం ఫలితంగా.. భారత్, చైనా సహా పలు ఆసియా దేశాలకు చెందిన దాదాపు 1400 వస్తువులపై దిగుమతి సుంకాలు ఏకంగా 50 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అధిక సుంకాలను 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికన్ సెనెట్ బుధవారం రోజు ఆమోదం తెలిపింది. ఈ దేశాల దిగుమతి బిల్లు మరింత భారంగా మారనుంది. మెక్సికో సెనెట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ జరగ్గా.. అనుకూలంగా అంటే మద్దతు తెలుపుతూ 76 ఓట్లు పోలయ్యాయి. వ్యతిరేకిస్తూ ఐదుగురు ఓటేశారు. దీంతో అందరి సమ్మతితో ఈ బిల్లు వచ్చే ఏడాది 2026, జనవరి 1 నుంచి అమలు కానుందని సెనెట్ తెలిపింది. ఈ సుంకాలు కనీసం 5 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం వరకు ఉంటాయి.

ఇది కూడా చదవండి: Post Office: బెస్ట్‌ స్కీమ్‌.. రోజుకు రూ.222 డిపాజిట్‌తో చేతికి రూ.11 లక్షలు!

ఇవి కూడా చదవండి

మెక్సికోతో ప్రస్తుతానికి ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోని భారత్, సౌత్ కొరియా, చైనా, థాయిలాండ్, ఇండోనేసియా వంటి దేశాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ఆటోలు, ఇతర ఆటో విడిభాగాలు, దుస్తులు/వస్త్రాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉక్కు వంటి విస్తృత శ్రేణి ప్రొడక్ట్స్‌పై ఈ దిగుమతి సుంకాలు వర్తిస్తాయి.

కేంద్రం చర్యలు:

ఇదిలా ఉండగా, ఎంపిక చేసిన ఉత్పత్తులపై భారతదేశంపై 50 శాతం సుంకాల పెంపును మెక్సికో ఆమోదించిన తర్వాత తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. భారత్‌ నుంచి వచ్చే దిగుమతులపై మెక్సికో ఏకపక్షంగా 50 శాతం సుంకం విధించడంతో కలకలం రేగుతోంది. ఈ విషయంలో మెక్సికోతో చర్చిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పరిష్కారం కోసం భారత్ మెక్సికోతో చర్చలు ప్రారంభించింది. అయితే తమ దేశ ఎగుమతిదార్ల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకునే హక్కు కూడా తమకు ఉందని భారత వర్గాలు పేర్కొన్నాయి. భారత వాణిజ్య శాఖ మెక్సికో ఆర్థిక శాఖతో చర్చిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

అయితే తక్కువ ధరకు వచ్చే దిగుమతుల నుంచి దేశీయ వ్యాపారాలను కాపాడుకునేందుకు ఈ సుంకాలు విధిస్తున్నట్టు మెక్సికో ప్రభుత్వం చెప్పింది. అయితే, మెక్సికో,కెనడాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై అమెరికా త్వరలో సమీక్ష జరపనున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ను మంచి చేసునేందుకు మెక్సికో అధ్యక్షురాలు ఈ తరహా సుంకాలు విధించినట్టు పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత్ నుంచి ఎగుమతయ్యే 75 శాతం ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది భారత్ 5.6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను మెక్సికోకు ఎగుమతి చేసింది.

ఇది కూడా చదవండి: Success Story: ఇంతకీ ఈమెను గుర్తుపట్టారా? ఒకప్పుడు రోజుకు రూ.1,200 జీతం.. ఇప్పుడు రూ.8,352 కోట్ల విలువైన సామ్రాజ్యం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి