Stock Market: అంతర్జాతీయ పరిణామాల మధ్య ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30కి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 70 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ-50 కేవలం 30 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 200 పాయింట్ల మేర లాభంలో ఉన్నాయి. ప్రారంభ సెషన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిప్లా, అరబిందో ఫార్మా కంపెనీల షేర్లు ఫోకస్ లో ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ ఈ రోజు కూడా పతనం అయ్యే అవకాశం ఉన్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ ఊహిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బం వివరాలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రెపో రేటు పెంపుతో మార్కెట్లు భారీగా కరెక్ట్ అయ్యాయి.
ఇవీ చదవండి..
Elon Musk: చైనాలో ఎలాన్ మస్క్ కు భారీ షాక్.. వరుస సమస్యలతో ప్రపంచ కుబేరుడు ఉక్కిరిబిక్కిరి..
Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు.. నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు..