Stock Market: గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాలకు అనుగుణంగా ఈరోజు భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఓపెనింగ్ డీల్స్‌లో పడిపోయాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB), రాబోయే యుఎస్ ద్రవ్యోల్బణం డేటా పెట్టుబడిదారులను కలవరపెట్టడమే వాల్ స్ట్రీట్ పతనానికి కారణంగా తెలుస్తోంది. ఈ కారణంగా ప్రభావితమైన ఆసియా మార్కెట్లు సైతం తీవ్ర ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. SGX నిఫ్టీ సైతం గ్యాప్-డౌన్ ప్రారంభం కావటం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ బెంచ్ మార్క్ సూచీ ఆరంభంలో 636 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50.. 194 పాయింట్లు క్షీణించాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 పాయింట్లు, స్మాల్ క్యాప్ 1.01 శాతం పడిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. నేడు ఎల్ఐసీ యాంకర్ లాక్ ఇన్ పిరియడ్ ముగియనుండటం వల్ల షేర్ ఎలా ప్రభావితం అవుతుందనే విషయాన్ని ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారు.
బజాజ్ ఆటో 0.73%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.60%, మారుతీ సుజుకీ 0.51%, ఎన్టీపీసీ 0.23%, టైటాన్ కంపెనీ 0.14%, హీరో మోటొకార్ప్ 0.10% మేర లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. విప్రో లిమిటెడ్ 3.02%, హిందాల్కో 2.28%, టెక్ మహీంద్రా 2.14%, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 1.88%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.83%, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1.81%, టాటా స్టీల్ 1.76%, ఇండస్ టవర్స్ 1.73%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.70%, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 1.62% మేర నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.